Top Headlines @5PM on 1st January 2024, Top Headlines @5PM, telugu news, top news, new year celebrations, Telangana, Andhrpradesh, National News, Tollywood Sports
కొత్త సంవత్సరం రోజు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదు అని పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను.
కొత్త సంవత్సరం శుభ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజానీకంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలకు, యవత్తు దేశ ప్రప్రంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలను రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైకి రేవంత్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు సీతక్క, కొండా సురేఖతో పాటు పలువురు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫిబ్రవరి 17న వైఎస్ షర్మిల కుమారుడి వివాహం: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయి. అనిల్ కుమార్, వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజా రెడ్డి 2024 ఫిబ్రవరి 17న పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల సోషల్ మీడియా ద్వారా స్వయంగా వెల్లడించారు. అట్లూరి ప్రియాతో రాజా రెడ్డికి వివాహం జరగనున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. రాజా రెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే…
Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనగానే మీకు ముందుగా గుర్తుకు వచ్చేది ఏమిటి? అవును, తెలంగాణలో ఏ పండుగకైనా మందు తప్పనిసరిగా ఉండాలి. డిసెంబర్ 31 అంటే ఇకపై ఎంజాయ్ మామాలుగా ఉండదు.
Temperatures in Telangana: తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత పది రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి.
మంత్రి విడుదల రజిని కార్యాలయంపై రాళ్ల దాడి: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గుంటూరులో ఆదివారం అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విద్యానగర్‌లోని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని నూతన పార్టీ ఆఫీస్‌పై టీడీపీ-జనసేన కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దీంతో కార్యాలయ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి.. గుంపును చెదరగొట్టారు. కొంతమంది టీడీపీ-జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మంత్రి విడుదల రజిని కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఉంది.…
బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలింది: మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టీడీపీ -జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయం అని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందన్నారు. 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. 1932లో జనవరి 4న గాంధీ అరెస్టు ఎలా గుర్తుందో.. 2023…