T20 World Cup: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా.? లేదా.? అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు, ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(PCB) చీఫ్ మొహ్సీన్ నఖ్వీ సోమవారం భేటీ అయ్యారు. భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన బంగ్లాదేశ్‌ను ఇటీవల ఐసీసీ బహిష్కరించింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా తాము కూడా టోర్నీ నుంచి వైదొలుగుతామని పాకిస్తాన్ కామెంట్స్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాక్ టోర్నీలో పాల్గొంటుందా అనే సందేహాలు తలెత్తాయి.
Read Also: Instagram Murder: ఇన్‌స్టాలో పరిచయం, పెళ్లి పేరుతో నమ్మించి మైనర్ బాలిక హత్య..
అయితే, సమావేశం అనంతరం నఖ్వీ మాట్లాడుతూ.. 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పాల్గొనడంపై తుది నిర్ణయం శుక్రవారం (జనవరి 30) లేదా వచ్చే సోమవారం (ఫిబ్రవరి 2) తీసుకుంటామని ఆయన చెప్పారు. మరోవైపు, కొత్త డ్రామాకు పాకిస్తాన్ తెర తీసినట్లు తెలుస్తోంది. టోర్నీ మొత్తం బహిష్కరించకున్నా, భారత్‌తో కొలంబోలో జరిగే మ్యాచ్‌ను ఆడకపోవచ్చని పలు పాకిస్తాన్ మీడియా నివేదికలు చెబుతున్నాయి.
“ప్రధానమంత్రి మియాన్ ముహమ్మద్ నవాజ్ షరీఫ్‌తో ఫలవంతమైన సమావేశం జరిగింది. ఐసీసీ విషయమై ఆయనకు వివరించాను, అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకుని దీనిని పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. తుది నిర్ణయం శుక్రవారం లేదా వచ్చే సోమవారం తీసుకుంటామని అంగీకరించాం,” అని నఖ్వీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, ఆదివారం పాకిస్తాన్ 15 మందితో టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ప్లేయర్లను ప్రకటించింది.