టానిక్ మద్యం షాప్ లో అక్రమాలు ఒక్కోక్కటిగా బయటపడుతున్నాయి. నిన్న ( సోమవారం) సాయంత్రం నుంచి GST అధికారుల సోదాలు చేస్తున్నారు. ఏ మద్యం షాప్ కు లేని వేసులుబాటు టానిక్ కు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్ నగరంలో నకిలీ మందుల తయారీ గుట్టురట్టు అయింది. మెగ్ లైఫ్ సైన్సెస్ కంపెనీ పేరుతో మార్కెట్లోకి వస్తున్న మెడిసిన్స్ నకిలీవనీ డగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గుర్తించారు.
నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్ విలేజ్ లో దోబిఘాట్ ప్రాంగణంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం మడ్ ఫోర్డ్ దోబిఘాట్ ఫేజ్ -2లో మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ను ఆయన ప్రారంభించారు.
సీఎం రేవంత్ రెడ్డి- ప్రధాని మోడీని బడా భాయ్ అని చెప్పి గుజరాత్ మోడల్ తెలంగాణలో అమలు చేస్తా అంటున్నాడు అని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.