Holidays: రోజూ స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బిజీబిజీగా ఉండే విద్యార్థులకు సెలవులంటే పండగలాంటిది. ఎందుకంటే ఈ విద్యార్థులకు ఆదివారం తప్ప మరే రోజు సెలవు లేదు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు అదనంగా సెలవులు ఇస్తే చాలా బాగుంటుందని భావిస్తున్నారు. నిజానికి స్కూళ్లు, కాలేజీలకు రెండు, మూడు రోజులు అదనంగా సెలవులు ఇవ్వాలంటే పండుగలు కూడా ఉండాల్సిందే. మరి, ఆ పండగలు ఎప్పుడెప్పుడు వస్తాయోనని క్యాలెండర్ చూసుకుని విద్యార్థులు సెలవుల కోసం ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మార్చి నెల సరైనదనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు మరో శుభవార్త అందింది. ఈ నెలలో పాఠశాలలు, కళాశాలలకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
Read also: Ration Rice Seized: మహారాష్ట్రకు భారీగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాలు పట్టివేత..!
ఎందుకంటే.. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ పండుగ ఒకటి. దీపావళి తర్వాత దేశంలో అత్యంత జరుపుకునే పండుగ ఇదే. కానీ హిందూ పురాణాల ప్రకారం హోలీ పండుగ సత్యయుగం నుండి జరుపుకుంటారు. మార్చి 24 ఆదివారం ఉదయం కాబట్టి. ఇక మరుసటి రోజు అంటే మార్చి 25 (సోమవారం), హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా రెండు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. అలాగే మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా.. ఆ రోజు కూడా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న సెలవు.. ఆ తర్వాత ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 11న ఈదుల్ ఫితర్ (రంజాన్), ఏప్రిల్ 17న శ్రీరామనవమి. అలాగే వేసవి ఏప్రిల్ సెలవులు నెలాఖరు నుండి ప్రారంభమవుతాయి.
Lok Sabha Elections 2024 : ఆ ఐదు సీట్ల విషయంలో చిక్కుల్లో పడిన ఎన్డీయే