తెలంగాణలో పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్ టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు.
రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీ, అభయహస్తం గ్యారెంటీ పథకాలను తప్పనిసరిగా అమలు చేస్తామని, మరో రెండు గ్యారెంటీ పథకాల అమలును ప్రభుత్వం ప్రారంభించిందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు, ధర్నాలు చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలంటూ బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించడానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(NDSA) నిపుణుల కమిటీ నేడు(బుధవారం) రాష్ట్రానికి రానుంది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులు చేపట్టడానికి వీలుగా వాటి నిర్మాణం, లోపాలపై అధ్యయనం చేయాలని కోరుతూ ఫిబ్రవరి 13న తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎన్డీఎస్ఏకు లేఖ రాశారు.
పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.
లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీనీ ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.. కానీ యావత్ భారత దేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పని చేస్తున్నాడు అని తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసం పని చేస్తున్నాడు..
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారు అని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహ గర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచే ప్రారంభించారు.
మేడిగడ్డకు రిపేర్ చేయాలని నేషనల్ డ్యాన్స్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇస్తే రిపేర్లు చేస్తాం.. కేసీఆర్ చదివింది కేవలం బీఏనే.. పార్లమెంట్ ఎన్నికల్లో పీజీ చేసినట్టు సమాచారం ఇచ్చాడు.. కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులే మేడిగడ్డలో దొంగలు.. ఈ దొంగల సలహాలు తీసుకొని రిపేర్లు చేయమంటారా అంటూ సీఎం అడిగారు.