HYD Rains: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం.. చల్లబడిన నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్(Hyderabad) నగరంలోని పలు చోట్ల మళ్లీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధానిలో మధ్యహ్నం నుంచి వర్షం మొదలైంది. భాగ్యనగరంలోని బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, ముసాపేట, ఎర్రగడ్డ, మధురానగర్, యూసఫ్ గూడ ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మిగతాప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
READ MORE: Ap Child Welfare Commission Chairman: భ్రూణ హత్యలు ఆపండి..పిల్లలు వద్దనుకుంటే మాకు అప్పగించండి
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా.. మరోవైపు వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఆదివారం రోజు నైరుతి రుతుపవనాలు అండమాన్ చేరుకున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఆదివారం వర్షం కురిసింది. సోమవారం మధ్యహ్నం నుంచి మళ్లీ మొదలైంది. వర్షాల కారణంగా చాలా చోట్ల రోడ్లు చెరువులుగా మారడంతో పాటు డ్రెయిన్లు నీటితో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతోపాటు రోడ్లపై నీటి ఎద్దడిని తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. పైన తెలిపిన ప్రదేశాలకు వెళ్లే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అంతే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!