తెలంగాణ రాష్ట్ర ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం తిరిగి ప్రారంభమైంది. ప్రజలు తమ సమస్యలను తెలియజేయడానికి రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటాన్నారు. రాష్ట్రలో ఎన్నికల కోడ్ ముగియడంతో, ఈ కార్యక్రమం పునఃప్రారంభమైందని ప్రజావాణి ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఛైర్మన్ జి. చిన్నారెడ్డి తెలిపారు. ప్రజల అభ్యర్థనలను ఇవాళ అంగీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది అని చెప్ప్పుకొచ్చారు.