Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర చిహ్న ఆవిష్కరణకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. చివరి నిమిషంలో లోగో ఆవిష్కరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో అవసరమైన విత్తనాల సరఫరా తగినంతగా ఉండేలా విత్తన కంపెనీలతో ఫిబ్రవరి, మార్చి మాసంలో వరుస సమావేశాలు నిర్వహించామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 2023-24 సంవత్సరంలో 44.92 లక్షల ఎకరాల పత్తి పంట సాగు కాగా.. ఈ వానా కాలానికి 55 లక్షల ఎకరాలలో పత్తి పంట సాగు కాగలదని అంచనా వేసి 1.24 కోట్ల పత్తివిత్తన ప్యాకేట్లను రైతులకు అందుబాటులో ఉంచడానికి మార్చి మాసంలోనే ప్రణాళిక చేయడం జరిగిందని.. దానికనుగుణంగా ఈరోజు వరకు…
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. మే 29-30 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు.
నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపనీ తమ ఉత్పత్తులను తెలంగాణ బేవరేజ్ కార్పోరేషన్ కు సరఫరా చేసేందుకు అనుమతినిచ్చిందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎటువంటి దరఖాస్తులు రాలేవని గతంలో ఓ ప్రెస్ మీట్ సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఆ ఫైల్ తన వద్దకు రాలేదని, ఇప్పుడు ఉన్న ప్రోసీజర్ ప్రకారమే నిర్ణయాలు తీసుకునే అధికారం…
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఏసీబీ అధికారులు మారువేషాల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని చెక్‌పోస్ట్‌ల దగ్గర తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. 12 సంవత్సరాల తరువాత రవాణా శాఖ కార్యాలయాలపై ఏసీబీ రైడ్ నిర్వహిస్తోంది.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నెముక ఇరిగింది అని తాను ముందే చెప్పానని తెలిపారు. గత ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి విడిచారు, సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టామని చెప్పారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదని పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ అంశం అధికారులు చూసుకుంటున్నారని.. దానితో తనకు ఎలాంటి సంబంధం లేదని సీఎం…