రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు కీలక అధికారులను గొర్రెల స్కామ్‌లో అరెస్ట్ చేసింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ టి.రఘునాథరావు పదవీ విరమణ పొందారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ - ఆపరేషన్స్ పి.జీవన్ ప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన వారిని టీజీఎస్ఆర్టీసీ ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికింది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ దారుణమైన సంఘటన సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్ 7, 8వ తేదీల్లో తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
తెలంగాణలో మరో కీలక పరిణామం జరిగింది. టెస్కాబ్ ఛైర్మన్ పదవికి కొండూరి రవీందర్ రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం రవీందర్రావు మీడియాతో మాట్లాడుతూ.. సహకార సంఘంలోని కొంత మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తాను పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు.