* టీ 20 వరల్డ్ కప్: నేడు సూపర్-8 మ్యాచ్‌లో భారత్ తొలిపోరు.. రాత్రి 8 గంటలకు ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనున్న భారత్
* నేడు జమ్ము కశ్మీర్‌కు ప్రధాని నరేంద్ర మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోడీ.. స్థానిక యువతతో ముఖాముఖి..
* అమరావతి: ఇవాళ రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటన.. తన రెండో క్షేత్ర స్థాయి పర్యటనను రాజధానిలో చేపట్టనున్న సీఎం. జగన్ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను ప్రారంభించనున్న సీఎం. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్న ముఖ్యమంత్రి.. ఉద్దండరాయుని పాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్న చంద్రబాబు
* విజయవాడ: నేడు రెండో రోజు కూడా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షలు.. తన శాఖలకు సంబంధించిన సోషల్ ఆడిట్, ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా విభాగాల అధికారులతో నేడు పవన్ భేటీ
* నేడు ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం.. గవర్నర్ ఎదుట ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్న గోరంట్ల
* రేపటి నుంచి రెండు రోజులు పాటు ప్రొటెం స్పీకర్‌గా 174 మంది సభ్యులతో ప్రమాణస్వీకారాలు చేయించనున్న. గోరంట్ల
* అమరావతి: ఏపీ అడ్వకేట్ జనరల్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న దమ్మాలపాటి శ్రీనివాస్
* అమరావతి: నేడు ఏపీలో బాధ్యతలు స్వీకరించనున్న ఎనిమిది మంది మంత్రులు
* నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి.. TUWJ iju మహాసభలలో పాల్గొననున్న విక్రమార్క
* ఖమ్మం: చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
* అమరావతి: ఇవాళ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. ఎన్నికల ఫలితాలపై జగన్ తొలి సమీక్ష. తాడేపల్లి జగన్ క్యాంప్ ఆఫీస్ లో భేటీ.
* ప్రకాశం : ఒంగోలులోని జిల్లా కలెక్టరు కార్యాలయంలో కేంద్ర కరువు బృందంతో సమీక్షా సమావేశములో పాల్గొననున్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి..
* ప్రకాశం జిల్లాలో నేడు కేంద్ర బృందం పర్యటన.. 2023 రబీ పంట నష్ట వివరాలను సేకరించేందుకు మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో జిల్లా అధికారులతో కలిసి కేంద్రం బృందం పర్యటన.. తర్లుపాడు మండలంలోని పోతలపాడు, గానుగపెంట, మార్కాపురం మండలంలో వేములకోట, పెద్దారవీడు మండలంలో గొబ్బూరులో రైతులను కలిసి పంట నష్టం వివరాలు, తాగునీటి కొరత తదితర విషయాలపై ఆరా తీయనున్న కరువు బృందం..
* తిరుమల: జేష్ఠాభిషేకంలో రోండోవ రోజు.. ఇవాళ స్వామివారికి ముత్యపు కవచంతో అలంకరణ చెయ్యనున్న అర్చకులు
* తిరుమల: రేపు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో ఆర్జిత సేవా టికెట్లు విడుదల.. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ
* తిరుమల: రేపు మధ్యహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టిక్కేట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ
* ఇవాళ విజయవాడ వెన్యూ కన్వెన్షన్ సెంటర్ లో బీజేపీ ప్రజా ప్రతినిధుల అభినందన సభ.. ఏపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలుపొందిన ప్రజా ప్రతినిధుల అభినందన సభ.. ఏపీ బీజేపీ నుంచి గెలుపొందిన ముగ్గురు ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలకు సన్మానం..
* నేడు ఏపీకి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలకున్న బీజేపీ నేతలు.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానున్న అభినందన సభకు హాజరుకానున్న శ్రీనివాస వర్మ..
* అమరావతి: ఇవాళ ఉదయం 9 గంటలకు పండిట్ నెహ్రూ బస్టాండు ను పరిశీలించనున్న రవాణా శాఖామంత్రి రాంప్రసాద్ రెడ్డి.. పండిట్ నెహ్రూ బస్టాండు లో సౌకర్యాలు, ట్రాఫిక్, ఉద్యోగులు, ఇతర అంశాలను పరిశీలించనున్న మంత్రి.. అనంతరం మీడియాతో మంత్రి సమావేశం
* అమరావతి: నేడు సచివాలయంలో ఉదయం 9.37 గంటలకు నీటి పారుదల శాఖ మంత్రి గా భాద్యతలు స్వీకరించనున్న నిమ్మల రామానాయుడు..
* అనంతపురం : జిల్లాలోని ఉరవకొండ , వజ్రకరూరు,విడపనకల్లు , కణేకల్లు మండలాల్లో పర్యటించనున్న కేంద్ర కరువు బృందం.. క్షేత్రస్థాయితో రబీలో దెబ్బతిన్న పంటల వివరాలను సేకరించనున్న బృందం సభ్యులు.
* అనంతపురం : పామిడి పట్టణంలో వ్తెసీపీ కార్యకర్తల సమావేశం.
* కర్నూలు: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో నేడు స్వామి వారి మూలబృందావనంకు తులసి అర్చన, కనకాభిషేకం, తుంగ జలంతో అభిషేకం, పాలాభిషకం, పంచామృతాభిషేకం వంటి విషేశ పూజలు.. రాత్రి ఉత్సవమూర్తి ప్రహ్లదరాయులకు ఊంజలసేవ, బంగారు పల్లకి, నవరత్న స్వర్ణ రథంపై ఉరేగింపు.
* తిరుపతి: నాలుగవ రోజుకు చేరుకున్న పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు.. నేడు తెప్పలపై పద్మా సరోవరంలో విహరించనున్న పద్మావతి అమ్మవారు.. రాత్రికి అమ్మవారికి గజవాహన సేవ…