రెడ్‌మి టర్బో 5 సిరీస్ చైనాలో లాంచ్ అయింది. ఈ సిరీస్‌లోని రెండు స్మార్ట్‌ఫోన్‌లు, రెడ్‌మి టర్బో 5, రెడ్‌మి టర్బో 5 మాక్స్ మార్కెట్లోకి విడుదలయ్యాయి. కంపెనీ రెడ్‌మి టర్బో 5 మాక్స్‌ను నాలుగు కలర్ ఆప్షన్లలో, రెడ్‌మి టర్బో 5 ను మూడు కలర్ ఆప్షన్లలో విడుదల చేసింది. రెడ్‌మి టర్బో 5 మాక్స్ ప్రధాన ఫీచర్లు చూస్తే.. 9000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 16GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్‌తో మార్కెట్లోకి విడుదలైంది.
Also Read:BSNL Recruitment 2026: బీఎస్ఎన్ఎల్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు.. మంచి జీతం..
రెడ్‌మి టర్బో 5 సిరీస్ ధర
రెడ్‌మి టర్బో 5 స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ చైనాలో 12GB RAM, 256GB స్టోరేజ్‌తో CNY 2,299 (సుమారు రూ. 30,000) కు రిలీజ్ అయ్యింది. దీనితో పాటు, కంపెనీ మరో రెండు మోడళ్లను విడుదల చేసింది – 12GB+512GB, 16GB+256GB CNY 2,599 (సుమారు రూ. 34,000) కు. ఈ ఫోన్ టాప్ మోడల్ 16GB RAM, 512GB స్టోరేజ్‌తో CNY 2,899 (సుమారు రూ. 38,000) కు ప్రారంభించారు. ఈ ఫోన్ ఆస్పిషియస్ క్లౌడ్ వైట్, షాడో బ్లాక్, షాలో సీ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.
Redmi Turbo 5 Max స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 12GB+256GB తో వస్తుంది. దీని ధర CNY 2,499 (సుమారు రూ. 33,000). ఫోన్ రెండవ వేరియంట్ CNY 2,799 (సుమారు రూ. 37,000) కు 16GB+256GB తో వస్తుంది. ఈ ఫోన్ మూడవ వేరియంట్ CNY 2999 (సుమారు రూ. 40,000) కు 12GB RAM, 512GB స్టోరేజ్ తో వస్తుంది. 16GB RAM, 512GB స్టోరేజ్ తో టాప్ వేరియంట్ CNY 3,299 (సుమారు రూ. 44,000) కు తీసుకొచ్చారు. ఈ ఫోన్ ఆస్పిషస్ క్లౌడ్ వైట్, సీ బ్రీజ్ బ్లూ, షాడో బ్లాక్, సన్ ఆరెంజ్ కలర్స్ లో రిలీజ్ అయ్యింది.
రియల్‌మీ టర్బో 5
రెడ్‌మి టర్బో 5, టర్బో 5 మాక్స్ డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారంగా షియోమి తాజా హైపర్‌ఓఎస్ 3పై రన్ అవుతాయి. రెడ్‌మి టర్బో 5 6.59-అంగుళాల (1,268×2,756 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 480Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 3500 నిట్‌ల గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. డిస్ప్లే వెట్ హ్యాండ్ టచ్ 2.0కి మద్దతు ఇస్తుంది. టర్బో 5 మాక్స్ 6.83-అంగుళాల (1,280×2,772 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే స్పెసిఫికేషన్లు ప్రామాణిక టర్బో మాదిరిగానే ఉంటాయి.
రెడ్‌మి టర్బో 5 మ్యాక్స్ 3.73GHz క్లాక్ చేయగల ఆక్టా-కోర్ 3nm మీడియాటెక్ డైమెన్సిటీ 9500s చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. మరోవైపు, టర్బో 5 3.4GHz క్లాక్ చేయగల 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌తో పనిచేస్తుంది. రెండు ఫోన్‌లు 16GB వరకు LPDDR5x అల్ట్రా RAM, 512GB UFS 4.1 స్టోరేజ్‌తో వస్తాయి. రెండు ఫోన్‌లు IP66 + IP68 + IP69 + IP69K రేటింగ్‌తో ఉన్నాయి.
ఫోటోగ్రఫీ పరంగా, రెడ్‌మి టర్బో 5 సిరీస్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. రెండు ఫోన్‌లలో 8-మెగాపిక్సెల్ (f/2.2) అల్ట్రావైడ్ కెమెరా ఉంది. టర్బో 5 మ్యాక్స్‌లో ప్రైమరీ కెమెరా కోసం 50-మెగాపిక్సెల్ (f/1.5) లైట్ హంటర్ 600 లెన్స్ ఉంది. టర్బో 5లో 50-మెగాపిక్సెల్ (f/1.5) సోనీ IMX882 ప్రైమరీ షూటర్ ఉంది. రెండు ఫోన్‌లలో 20-మెగాపిక్సెల్ (f/2.2) ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది.
రెడ్‌మి టర్బో 5 మాక్స్ 9,000mAh బ్యాటరీని కలిగి ఉండగా, టర్బో 5 7,560mAh బ్యాటరీని కలిగి ఉంది. రెండు రెడ్‌మి ఫోన్‌లు 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. రెండు ఫోన్‌లు 5G, 4G LTE, USB టైప్-C పోర్ట్, బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని అందిస్తున్నాయి. టర్బో 5 మాక్స్ Wi-Fi 7కి మద్దతు ఇస్తుండగా, టర్బో 5 Wi-Fi 6కి మద్దతు ఇస్తుంది.