లంచం తీసుకుంటూ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. నీటి పారుదల శాఖకు చెందిన ముగ్గురు ఇంజనీర్లతో పాటు సర్వేయర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భన్సీ లాల్, అసిస్టెంట్ ఇంజనీర్లు కార్తీక్, నికేష్ కుమార్‌తో పాటు సర్వేయర్ గణేష్‌ను ఏసీబీ అరెస్టు చేసింది.
బీజేపీ మిత్రపక్షం అయిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కాపాడేందుకే.. సీబీఐ విచారణ కోరుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించండి అని బీజేపీ నిరసన చేయడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు.
Warangal: వరంగల్ నగరం లోని స్టార్ హోటల్ లో లొట్టలు వేసుకుంటూ తింటున్నారా.. మీరు తినే తిండి కుళ్లిపోయిందేమో ఒక్క సారి చూసుకోండి. అవును మీరు విన్నది నిజమే.
తెలంగాణలో బీరు తయారు చేసే బ్రూవరీస్ కంపెనీలకు మూడో షిప్టు అనుమతించక పోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిరదని మీడియాలో వచ్చిన కథనం సత్యదూరమని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ కమిషనర్ శ్రీధర్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేశారు. జూన్ 2న ఉదయం 9.30కు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు.