* నేడు ప్రపంచ యోగా దినోత్సవం
* టీ20 వరల్డ్ కప్: రాత్రి 8 గంటలకు ఇంగ్లాండ్‌తో తలపడనున్న దక్షిణాఫ్రికా
* జమ్మూ కశ్మీర్‌లో పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. నేడు శ్రీనగర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్న మోడీ
* ఢిల్లీ: నేడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రెస్‌మీట్.. నీట్‌పై కేంద్ర విద్యాశాఖ కీలక ప్రకటన చేసే ఛాన్స్
* నేడు, రేపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఉదయం 9.44 గంటలకు ప్రారంభంకానున్న అసెంబ్లీ.. ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించనున్న ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి.. మొదట సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారం.. ఆ తర్వాత ఎమ్మెల్యేల ప్రమాణం.. సాధారణ సభ్యుడిగానే ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్
* అమరావతి: నేడు అసెంబ్లీలోకి నో విజిటింగ్ పాసెస్..
* హైదరాబాద్: ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం
* హైదరాబాద్: నేడు మరోసారి వైఎస్ జగన్ ఆస్తుల కేసు విచారణ చేపట్టనున్న సీబీఐ కోర్టు
* నేడు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. తెల్లాపూర్ మున్సిపల్ బిల్డింగ్ ప్రారంభోత్సవం, గద్దర్ ఆడిటోరియం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
* ప్రకాశం : జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అమరావతిలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు..
* ప్రకాశం: జిల్లా వ్యాప్తంగా అన్నీ పాఠశాలల్లో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాల కార్యక్రమాలు..
* బాపట్ల : వేటపాలెం మండలం రావూరిపేటలో సంతరావూరు కనక నాగవరపమ్మ శిడిమాను మహోత్సవం..
* ప్రకాశం: చీరాల మండలం పేరాల శ్రీ గంగా భ్రమరాంబ సమేత పులుగు రామలింగేశ్వర స్వామి ఆలయంలో 45 అడుగుల ధ్వజస్తంభం పునర్నిర్మాణ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు..
* నెల్లూరు: ఇందుకూరుపేట మండలం గంగపట్నం లో శ్రీ చాముండేశ్వరి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు కళ్యాణోత్సవం
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారికి సప్తనదీ జలాలతో జ్యేష్ఠ మహాభిషేకం
* తూర్పుగోదావరి జిల్లా: నేడు ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన.. సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించిన తమకు రావలసిన వేతనాలు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నందుకు నిరసనగా ఆందోళన
* తిరుమల: నేటితో ముగియనున్న శ్రీవారి వార్షిక జేష్టాభిషేకం ఉత్సవాలు.. ఇవాళ స్వామివారికి బంగారు కవచంతో అలంకరణజజ రేపటి నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరణ
* శ్రీ సత్యసాయి : హిందూపురంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో 85వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు
* శ్రీ సత్యసాయి : సోమందేపల్లి మండలం చాకర్లపల్లి వద్ద ఉన్న రైల్వే గేట్ మరమ్మత్తుల కారణంగా ఇవాళ రాకపోకలు బంద్ చేయనున్న అధికారులు. అనంతపురం నుంచి హిందూపురం కు వెళ్లే వాహనాలను పాలసముద్రం మీదుగా మళ్లింపు.
* తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులుకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* విశాఖ: నేడు పోర్టు వేంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.. సముద్రంపై నౌకా విహారం చేయనున్న స్వామి వారు…
* అమరావతి: నేడు సీఎం హోదాలో గౌరవ సభకు చంద్రబాబు.. మళ్లీ సీఎంగానే సభకు వస్తానని 2021 నవంబర్ 19న సభలో శపథం చేసిన చంద్రబాబు.
* అమరావతి: ఏపీ డీజీపీగా నేడు బాధ్యతలు చేపట్టనున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ద్వారకా తిరుమల రావు
* అమరావతి: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో యోగా దినోత్సవం..