Ntvతో భారతీయ జనతా పార్టీ పార్లమెంటరి బోర్డు మెంబర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇవాళ ఢిల్లీలో ఎన్డీయే కీలక సమావేశం జరుగుతుంది.. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరగనుంది.. ప్రధానిగా మోడీ అభ్యర్థిత్వంలో ఎలాంటి అనుమానాలు లేవు అని చెప్పుకొచ్చారు.
ఇంటర్ బోర్డు అధికారుల దౌష్టికం రోజురోజుకు పెరిగిపోతుంది అని ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఇంటర్ విద్య మండలిలో తిష్ట వేసిన అధికారుల యొక్క నిర్ణయాలు ఇంటర్ అధ్యాపకుల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు.
వైద్య విద్యనభ్యసించి పేద వారికి వైద్య సేవలందించాలని కొందరు తహతహలాడుతుంటారు. ఇందుకోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు నిర్వహించే ఎంట్రెన్స్ పరీక్షలను రాస్తుంటారు. వైద్య విద్య కోసం దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు.
గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయడానికి తెలంగాణ హైకోర్ట్ మంగళవారం నిరాకరించింది. ఈ నెల 9వ తేదీన జరిగే ఈ పరీక్షకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తైనందున ఈ దశలో వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకోలేమని చెప్పుకొచ్చింది.
ఇవాళ ఉదయం 8 గంటలకు నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ గోడౌన్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాన్ని మరోసారి బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి గెలుపొందారు. మొత్తం 10,42,493 ఓట్లు పొలైయ్యాయి. కిషన్‌రెడ్డికి 4,72,012 ఓట్లు వచ్చాయి. మొత్తం 49,944 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. పార్టీ స్థాపించి 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో అన్ని రకాల ఎత్తుపల్లాలను చూశామన్నారు. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు, ఎదుర్కొన్నామన్నారు.