ఆంధ్రప్రదేశ్ తీర్పు వైవిధ్యమైందని.. ఈ ఫలితాలను తాము ముందే ఊహించామని మంత్రి కొండా సురేఖ అన్నారు. కక్షపూరితమైన పాలన తోనే జగన్ ను ఓటమిపాలయ్యారని విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడే ప్రజలు చంద్రబాబును గెలిపించాలని నిర్ణయించుకున్నారని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ మూసారాంబాగ్ లో ఉన్న ఒక రెడ్ రోజ్ బేకరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయం తో పరుగు తీశారు. మంటలను ఆర్పేందుకు ఐదు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని విజయవంతంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తూ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే, భారీగా ఆస్తి నష్టం జరిగింది అని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని…
Telangana Lok Sabha Elections 2024 Results: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఏడు నియోజక వర్గాలు ఉన్నాయి. జిల్లాల వారీగా లెక్కింపు కేంద్రాలను మూడు చోట్ల…
Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానం కూడా రాదని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో శ్రీనన్న కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ పాలిసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్షను మే 24న నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా 82, 809 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
Monsoon in AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ సాధారణం కంటే రెండు రోజుల ముందుగానే కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా నైరుతి రుతుపవనాలు ఆదివారం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి రానున్న రెండు, మూడు రోజులల్లో ఏపీ మొత్తం విస్తరించనున్నాయని ఈ ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో సోమవారం మోస్తరు వర్షాలు, ఎల్లుండి అక్కడక్కడ భారీ…