Bhatti Vikramarka: హైదరాబాద్ నగరంలోని ప్రజా భవన్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు విషెస్ చెబుతున్నారు.
ఆగస్టు, సెప్టెంబర్ నెలలో గోదావరి నదికి భారీ ఎత్తున వరదలు వచ్చిన సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దగ్గర ఉన్న అన్నదాన సత్రంలోకి నీళ్లు రావడం ప్రతి ఏడాది జరుగుతుంది.
రంగారెడ్డి జిల్లాలో పాఠశాల బస్సులపై రవాణా శాఖ అధికారులు దాడులు కొనసాగుతున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, ఉప్పల్ లో అధికారుల బృందం తనిఖీలు చేస్తున్నారు.
మద్యం షాపుల నుంచి బీర్లను పక్కదారి పట్టించినా, ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మకాలు కొనసాగించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్శాఖ కమిషనర్ ఈ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటుపడి తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. గత నెల 22న ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో మిస్టరీ వీడింది.
మైనర్ అమ్మాయిల ఫొటోలను మార్ఫింగ్ చేసి మార్చి బెదిరింపులకు పాల్పడుతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా మైనర్ అమ్మాయిలను పరిచయం చేసుకుంటున్న అజయ్ కుమార్ను ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని ఘట్కేసర్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు తెలిపారు.
తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పట్ల కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన మైనర్ అమ్మాయి అత్యాచారం, హత్య ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేయాలని డీజీపీని ఆదేశించారు.