తెలంగాణ రాష్ట్రానికి ఎల్లుండి (జూన్ 19న) కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాబోతున్నారు. ఇక, కేంద్రమంత్రులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో వారికి స్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ భారీగా ఏర్పాట్లు చేస్తుంది.
హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 ఆశిస్తున్న నిరుద్యోగ యువత బీఆర్ఎస్ కు వినతి పత్రం ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తమను రెచ్చగొట్టి హామీలు ఇచ్చిందని నిరుద్యోగులు అంటున్నారు.
వరంగల్ లోని ఈద్గాలో రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ డా.కడియం కావ్య హన్మకొండ బొక్కల గడ్డలోని ఈద్గాలో అలాగే ఖిలా వరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
నల్గొండ ఈద్గాలో బక్రీద్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలోని సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పని తీరు ఉండాలి తప్ప స్టాటిక్ గా ఉండకూడదు అని తెలిపారు.
సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.