Monarch Tractor: హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక..
- హైదరాబాద్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ విస్తరణకు ప్రణాళిక..
- టెస్టింగ్ సదుపాయం ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంస్థ..
- ఉత్పత్తి పెంపుతో మరిన్ని ఉద్యోగాల కల్పనకు అవకాశం..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులు లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monarch Tractor: హైదరాబాద్‌లో తమ సంస్థ విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన-అభివృద్ధి సంస్థను విస్తరించే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సంస్థ ప్రతినిధులు చర్చించారు. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందాన్ని మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ప్రతినిధులు కలిశారు. అనంతరం సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ ఆర్ అండ్ డీ సంస్థకు అనుబంధంగా స్వయంప్రతిపత్తి ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైటెక్, పర్యావరణ అనుకూల కంపెనీలను ఆకర్షించడంపై తాము దృష్టిసారించామని, మోనార్క్ ట్రాక్టర్స్‌ను తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Read also: Astrology: ఆగస్టు 11, ఆదివారం దినఫలాలు
Also Read
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
స్వయంప్రతిపత్తి, ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికతలో తెలంగాణను అగ్రగామిగా నిలిపామని, ఆ విజన్‌లో మోనార్క్ ట్రాక్టర్స్ బాగమై రాష్ట్రంలో తమ ఉనికిని విస్తరించుకోవాలని తాము ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో తమ కార్యకలాపాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఇతర అధికారులను కలవడం ఎంతో సంతోషం కలిగించిదని మోనార్క్ ట్రాక్టర్స్ CEO ప్రవీణ్ పెన్మెత్స వెల్లడించారు. హైదరాబాద్‌లోని తమ R&D కేంద్రం అధునాతన డ్రైవర్-ఆప్షన్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌లను రూపొందించడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తాము చూస్తున్నామని, ఫలితంగా హైదరాబాద్ ప్రాంతంలో మరింత ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి పూర్తి స్వయంప్రతిపత్తి, డ్రైవర్ తోనూ, డ్రైవర్ లేకుండానే నడిచే స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లతో మోనార్క్ ట్రాక్టర్స్ సాగు రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది.
Bandi Sanjay : అర్ధంపర్ధంలేని అంశాలతో భారతీయ సంస్కృతిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారు
తాజావార్తలు
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!