MLC Kavitha: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
CM Revanth Reddy Speech at NMDC Hyderabad Marathon: దేశంలోనే క్రీడలకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణను తీర్చిదిద్దుతాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. క్రీడల్లో ఆదర్శంగా నిలబడాల్సిన హైదరాబాద్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆ స్థాయికి చేరుకోలేకపోయిందని, క్రీడలను ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేస్తోందన్నారు. తెలంగాణ యువతను క్రీడల వైపు మళ్లించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని సీఎం చెప్పారు. గచ్చిబౌలి స్టేడియంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024…