N Convention: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం పూర్తిగా కూల్చి వేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులను కొనసాగించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధికారులు కూల్చివేశారు.
N Convention Demolish: హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా బృందం కూల్చి వేస్తోంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను అధకారులు కూల్చివేస్తున్నారు.
పీసీసీ అధ్యక్ష పదవి నిర్ణయాన్ని బట్టి.. మంత్రివర్గ విస్తరణలో సామాజిక కూర్పులు ఆధారపడి ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తుంది. రెండు మూడు రోజుల్లో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక చేసిన అనంతరం మంత్రి పదవులకు పేర్లు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ (శనివారం) రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు ఆయన మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్లబోతున్నారు.
KVP Ramachandra Rao: అసెంబ్లీ ముందున్న టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యులు కేవీపీ రామచంద్ర రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహా ప్రదాత టంగుటూరి ప్రకాశం పంతులు అని అన్నారు. పురాణాల్లో కర్ణుడి గురించి విన్నాం.. ఈ తరంలో ప్రకాశం పంతులు గురించి విన్నామన్నారు.
Doctors Negligence: నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో అశ్విని అనే మహిళ కుర్చీలోనే డెలివరీ అయింది. ఈరోజు తెల్లవారు జామున ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో వచ్చిన మహిళను ఆస్పత్రిలో చేర్చుకోవడానికి వైద్య సిబ్బంది నిరాకరించింది.