శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరిగింది.. దీంతో.. మరోసారి గేట్లు తెరిచేందుకు సిద్ధం అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు.. కాసేపట్లో రేడియల్ క్రెస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయబోతున్నారు.. అయితే, ఇన్ ఫ్లో రూపంలో 2,13,624 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యామ్‌లో వచ్చి చేరుతుంది..
నా రూటే సెపరేటు అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి.... కొంతకాలంగా మనిషొక దగ్గర మనసొక దగ్గర అన్నట్టుగా ఉంటున్నారట ఆ లీడర్.... పంటికింద రాయిలా మారిన ఆయన్ని ఎలా అటాక్ చేయాలా అని చూస్తున్న వారికి ఆయనే స్వయంగా ఆయుధం ఇచ్చేశారట. చుట్టూ సొంత మనుషులే చక్ర బంధం వేస్తున్న ఆ లీడర్ ఎవరు? ఏంటా పొలిటికల్ స్టోరీ?
హైడ్రా కూల్చివేతలు పొలిటికల్ టర్న్ తీసుకుంటున్నాయా? ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరుగుతోందా? పాతబస్తీలో చెరువుల ఆక్రమణలు, ఎంఐఎం అక్రమ నిర్మాణాల సంగతేంటని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వాన్ని డిఫెన్స్‌లో పడేసే ప్రయత్నం జరుగుతోందా? అసలు కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?
ఒకప్పుడు మేమే కింగ్‌లమని అన్నారు. మా మాటకు ఎదురే లేదంటూ రీ సౌండ్ ఇచ్చారు. తీరా.. ఇప్పుడు బయటికి వస్తే డబ్బులు ఖర్చు అనుకుంటూ.. కామ్ సినిమా చూస్తున్నారు. అసలే కష్టాల్లో ఉన్నాం... డీజిల్ రేట్లు కూడా బాగా పెరిగిపోయాయ్... ఇప్పుడెందుకు రా బుజ్జా అన్ని బళ్ళు... అంతా కలిసి ఒక బండిలో సర్దుకోండన్న పాపులర్ మూవీ డైలాగ్‌ని గుర్తు చేసుకుంటూ... జాగ్రత్త పడుతున్నారట. ఎవరా లీడర్స్? ఏంటి వాళ్ళకు వచ్చిన కష్టం.
తెలంగాణ రాజ్యసభ సభ్యుడిగా అభిషేక్ మను సింఘ్వీ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ విత్ డ్రా గడువు ఈరోజుతో ముగిసింది. కాగా.. రాజ్యసభ అభ్యర్థిత్వానికి కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, ఇండిపెండెంట్‌గా పద్మరాజన్ నామినేషన్ దాఖలు చేశారు.
ఎంత అభివృద్ధి చెందినా... పల్లెల్లో ఇంకా యువకు ఉన్నత విద్యాకు దూరమవుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్నిరకాలుగా అవగాహన కల్పించిన స్వల్ప మార్పే కనిసిస్తోంది. గతం కంటే అధ్వానంగా లేకపోయినప్పటికీ ... ఇప్పుడు కూడా పల్లెల్లో ఆర్థిక పరిస్థితి కారణంగా చదువకు దూరమవుతున్నా యువతులు ఉన్నారు.