Central Government: భారతదేశ వ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,858.60 కోట్ల నిధులను రిలీజ్ చేసింది. కేంద్ర ప్రభుత్వ వాటాలో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి 14 రాష్ట్రాలకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ నిధులు విడుదల చేసింది.
మల్లన్నసాగర్ వర్సెస్ మూసీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూసీపై బీఆర్ఎస్, మల్లన్నసాగర్ పై కాంగ్రెస్ పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి. గజ్వేల్లో మల్లన్నసాగర్ భూ నిర్వాసితులను మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. మల్లన్నసాగర్ ముంపు బాధితులకు బీఆర్ఎస్ సరైన నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. తామెక్కడ మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఖాళీ చేయించలేదని.. మీలాగా బాధితులపై లాఠీలతో కొట్టించలేదని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మల్లన్నసాగర్ బాధితుల సమస్యలను సీఎం…
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు వస్తాయని ఆశలు కల్పించడంతో ఓ వ్యక్తికి డబ్బులు ఇచ్చారు. కానీ ఉద్యోగాలు రాకపోవడంతో దంపతులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం సాయిరాం తండాలో చోటుచేసుకుంది.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు.
ఖమ్మం జిల్లా కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఏళ్లుగా పెండింగ్లోఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగిస్తారు. ఆ ధాన్యాన్ని మిల్లర్లు మర ఆడించి తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పాలి. అయితే కొన్ని సీజన్లుగా మిల్లర్లు సీఎంఆర్ అప్పగించకుండా పక్కదారి పట్టించినట్టు ఆరోపణలు ఉన్నాయి.
"మా నాన్న ఎప్పుడూ కొడుతున్నాడు..నాకు నాన్న వద్ద.. నేను హాస్టల్లోనే ఉంటా.." అంటూ ఓ పన్నెండేళ్ల బాలిక సోమవారం జగిత్యాల పోలీస్స్టేషన్కు వచ్చింది. జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో వెక్కి వెక్కి ఏడుస్తూ ఓ పన్నెండేళ్ల బాలిక తన గోడును వెళ్లబోసుకుంది.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రోడ్లు రక్తమోడాయి. ఈ ప్రమాదాల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.