DK Aruna: చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళ మోర్చ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖతో నాకు మంచి అనుబంధం ఉంది.. గతంలో ఇద్దరం కలిసి మంత్రులుగా పని చేశాం.
TPCC Chief Mahesh Goud: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేవుళ్ళ పేరుతో రాజకీయం, ఓట్ల బిక్షాటన చేస్తున్నారు అని మండిపడ్డారు.
Jagadish Reddy: సూర్యాపేట జిల్లాలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై మండిపడ్డారు. కొండా సురేఖ మాటలు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వచ్చేలా ఉన్నాయన్నారు.
కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్క్ చుట్టూ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు, సిగ్నళ్లు, యూటర్న్లు లేకుండా చర్యలు చేపట్టింది. 826 కోట్ల రూపాయలతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు పాలనాపరమైన అనుమతులిచ్చింది తెలంగాణ ప్రభుత్వం.
Minister Tummala: రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం.
Ponguleti Srinivasa Reddy: ధరణి పొర్టల్ ను రద్దు చేసి త్వరలో ROR చట్టం తీసుకు వస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇ
KTR: రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 9వ తేదీలోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి, ఆగస్టు 15వ తేదీ వరకు కూడా చేయలేదు.. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడు.. కేసీఆర్ ది రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి.. 6 గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జూట సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి కుంటుబడిపోయింది అని హరీష్ రావు పేర్కొన్నారు.
TGPSC Office: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి.