TG Govt GO: తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు బంగారు బోర్డర్తో కూడిన ఆకుపచ్చ చీరను ధరించి, ప్రశాంతమైన నడవడికతో సంప్రదాయ మహిళా మూర్తిగా ఉన్న ఈ విగ్రహం నేడు తెలంగాణ తల్లి విగ్రహంగా ఆమోదం పొందింది.
Telangana Assembly Sessions: ఇవాల్టి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. సభకు ముందు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగనుంది.
KTR : తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చే ప్రభుత్వం నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, అస్థిత్వంపై అవగాహన లేకుండా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ చర్య తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరుస్తుందని, ప్రజల ఆవేదనకు బీఆర్ఎస్ గొంతుకగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను శాసనసభ, మండలిలో నిలదీస్తామని కేటీఆర్ ప్రకటించారు. గ్రామ పంచాయతీలలో నిధుల కొరతను ప్రశ్నిస్తూ, సర్పంచులు, మాజీ సర్పంచులకు బిల్లుల…
Maoists :తెలంగాణ చత్తీస్ గడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా పామిడి ఏరియాలో ఉన్న బేస్ క్యాంపు లపై మావోయిస్టులు పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. గత నాలుగు రోజులు వ్యవధిలో మూడుసార్లు జీడిపల్లి బేస్ క్యాంపై మావోయిస్టులు దాడి చేశారు. గత రాత్రి బేస్ క్యాంప్ పై దాడి చేశారు. మళ్లీ ఆయుధాలను సమకూర్చుకొని ఈ తెల్లవారుజామున కూడా దాడి చేశారు .దీంతో తెలంగాణ సరిహద్దులోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా సరిహద్దులు…
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తెలంగాణలో కూడా కొన్నిచోట్ల పడ్డాయి. శనివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహా సముద్రం మీదుగా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఈ అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రోజు ముగిసేనాటికి అల్పపీడనం బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా…
Hit and Run: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది.