* ఢిల్లీ: నేటి నుంచి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో రెండో ఎడిషన్.. ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.. గ్లోబల్ ఎక్స్‌పోలో కొత్త కార్లను విడుదల చేయనున్న పలు కంపెనీలు.. వాహనాల ప్రదర్శనతో పాటు, స్పేర్ పార్ట్స్ ప్రదర్శన.. పాల్గొననున్న 5,100 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు
* ఏపీ: సాయంత్రం టీడీపీ మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం.. నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వంపై చర్చ, ఎంపీలు, జోనల్ ఇంఛార్జ్‌లతో చంద్రబాబు సమావేశం.. ఆయా శాఖలపై ఎంపీలు దృష్టి పెట్టాలని ఇప్పటికే సీఎం సూచన.. మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేలా నేటి సమావేశం.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను జనంలో తీసుకెళ్లేలా సీఎం దిశానిర్దేశం
* అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం .. గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం. గీత కులానికి సంబంధించి పది శాతం మద్యం షాపుల కేటాయింపు పై కేబినెట్ లో చర్చ.. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణంపై నిర్ణయం తీసుకునే అవకాశం.. సీఎం దావోస్ పర్యటన, పెట్టుబడులకు సంబంధించి కేబినెట్ తర్వాత మంత్రులతో సీఎం చర్చించే అవకాశం.
* తిరుమల: ఎల్లుండితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండికి సంబంధించిన దర్శన టోకెన్లు జారీచేస్తున్న టీటీడీ.. ఇవాళ మధ్యాహ్నంకు టోకెన్ల జారి పూర్తి అయ్యే అవకాశం
* రేపు కడప జిల్లా లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు … స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం… మైదుకూరు మున్సిపాలిటీలో సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
* విజయనగరం: కోట జంక్షన్‌లో వున్న డేంఖేషావలీ బాబా దర్గా వద్ద నేటి నుంచి మూడు రోజులు పాటు ఉరుసు ఉత్సవాలు… ఉత్సవాల్లో భాగంగా ఖురాన్ పఠనం సహా వివిధ ఆధ్యాత్మిక కార్య క్రమాలు… నగరంలోని పలు ప్రాంతాల గుండా మహా ఊరేగింపు..
* నంద్యాల: నేటితో శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి ఆశ్వవాహనసేవ.. రాత్రి పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ
కర్నూలు.
* నంద్యాల: నేడు మద్దికేర( మం) పెరవలి శ్రీ రంగనాథ స్వామి వారికి మంగళ హారతి, కుంకుమార్చన, అభిషేకాలు, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు.
* కర్నూలు: ఆలూరు లో వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం.. పాల్గొనున్న ఎమ్మెల్యే బుసీనే విరుపాక్షి
* గుంటూరు కార్పొరేషన్ లో ,రసవత్తర రాజకీయం… అధికారులు, పాలకవర్గం మధ్య విభేదాలు.. విభేదాలతో ,నిరసనతో, గత కొద్ది రోజుల క్రితం వాయిదా పడిన కౌన్సిల్.. నేడు కౌన్సిల్ నిర్వహణపై సందిగ్ధం…
* నేడు సిద్దిపేట జిల్లాలో రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్న మంత్రి పొన్నం
* ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులతో కొత్త పథకాల అమలుపై సమీక్ష. రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు,ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై సమీక్ష.