దేశంలో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య రికార్డ్ స్థాయిలో నమోదవుతుంది. అయితే, గత 9 రోజులుగా తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. కేసుల సంఖ్య రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్నది. ఇక ఇదిలా ఉంటె, కరోనాతో పాటుగా ఇప్పుడు దేశాన్ని బ్లాక్ ఫంగస్ వ్యాధి ఇబ్బందులు పెడుతున్నది. కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ డిసీజ్ కనిపిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. తెలంగాణ సర్కార్ ఈ బ్లాక్…
తెలంగాణలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ మంచి ఫలితాలనే ఇస్తోంది… రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య 4 వేల లోపే నమోదు అవుతోంది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసి తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 71,070 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3,837 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 25 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.…
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. వరుసగా చాలా పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్నాయి.. ఇక, కొన్ని పరీక్షలను పూర్తిగా రద్దు చేసింది ప్రభుత్వం.. తాజాగా.. మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు నిర్వహించాల్సిన పరీక్షను కూడా వాయిదా వేసింది ప్రభుత్వం… షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల (జూన్) 6వ తేదీన 6వ తరగతి అడ్మిషన్స్ కోసం, 5వ తేదీన 7 నుండి 10 వ తరగతిలలో ఖాళీ సీట్ల అడ్మిషన్స్ కోసం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.. కానీ,…
నైరుతి రుతపవనాలు దక్షిణ అండమాన్ సముద్రము, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈనెల 21వ తేదీన ప్రవేశించే అవకాశములు ఉన్నాయి. ఉత్తర అండమాన్ సముద్రం మరియు దానిని అనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈనెల 22వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్రింది స్థాయి గాలులు తెలంగాణ రాష్ట్రంలో నైరుతి దిశ నుండి వీస్తూన్నాయి. రాగల 3 రోజులు (19,20,21వ తేదీలు) తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి…
ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం అంటూ గాంధీ ఆస్పత్రిలోని జూనియర్ డాక్టర్లు, నర్సులకు భరోసా ఇచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా రోగులతో నేరుగా మాట్లాడారు.. కొవిడ్ వార్డులను కలియతిరిగి రోగులను పలుకరించి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.. మీకు మేం ఉన్నామంటూ ధైర్యాన్ని చెప్పారు.. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. గాంధీలో కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసీయూ, ఎమర్జెన్సీ,…
కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.. ఇక, ఈ నెల 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం.. ఉత్తర్వులు రావడం అన్ని జరిగిపోయాయి.. తాజాగా పెట్రోల్ బంక్‌లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పెట్రోల్ బంకులన్నీ ఎప్పటిలా సాధారణంగా పనిచేయనున్నాయి. కాగా, లాక్డౌన్ సమయంలో పెట్రోల్ బంక్‌లు కూడా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి… రైల్వే ఉద్యోగులను “ఫ్రంట్ లైన్ సిబ్బంది”గా గుర్తించాలని తన లేఖలో పేర్కొన్నారు.. కరోన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విజృంభించిన నేపథ్యంలో మనదేశంలో వైద్య, పారిశుద్ధ్య, పోలీసు, పారామెడికల్ తదితర విభాగాల సిబ్బందితో పాటు రైల్వే శాఖ కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తమకు తెలిసిందే. భారతీయ రైల్వేలు నిరంతరం రోజుకు 24 గంటలు పని చేస్తూ ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సౌకర్యార్థం అనేక సేవలు…
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్., సభ్యులను బుధవారం, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ ఆమోదించారు. చైర్మన్ గా .. డా. బి. జనార్ధన్ రెడ్డి (ఐఎఎస్) (వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్థుతం పనిచేస్తున్నారు ). సభ్యులు గా.. రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)., ప్రొ. బి. లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ .,ప్రొ. హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి)., కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ…
తెలంగాణ రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని సిఎం కెసిఆర్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. అయితే కెసిఆర్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై బిజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఆయుష్మాన్ భారత్ లో చేరాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలన్న డిమాండ్ తో రేపు…
తెలంగాణ రాష్ట్రంలో అమల్లో వున్న లాక్ డౌన్ ను ఈనెల 30 తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులందరితో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను సిఎం కెసిఆర్ తెలుసుకున్నారు. క్యాబినెట్ మంత్రులందరి అభిప్రాయాలను సేకరించిన మేరకు సిఎం కెసిఆర్ లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం ఆదేశించారు.…