తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఇవాళ్టితో స్కూళ్లకు వేసవి సెలవులు ముగియగా.. రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కావాల్సిఉంది.. విద్యార్థులు స్కూళ్లకు రారు కానీ, ఉపాధ్యాయులు స్కూళ్లకు హాజరు కావాల్సి ఉంది.. కానీ, ప్రస్తుత పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించింది.. అన్ని స్కూళ్లు, డైట్ కాలేజీలకు జూన్ 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తూ స్కూల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో.. టీచర్లకు మరో ఐదు రోజుల పాటు వెసవి సెలవులు లభించినట్టు అయ్యింది.