కరోనా క్లిష్ట సమయంలో సేవలు అందించాల్సిన జూనియర్ డాక్టర్లు మళ్లీ ఆందోళనకు సిద్ధం అవుతున్నారు.. ఈ నెల 26వ తేదీ నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించారు జూడాలు.. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్న జూనియర్ వైద్యులు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.. ఇక, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం…
సిద్దిపేట అభివృద్ధిపై విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సిద్దిపేట లో ప్రజాస్వామ్యం ఉందా లేక నిరంకుశ నిజాం రాజ్యం నడుస్తోందా.? అని ప్రశ్నించిన ఆమె.. సర్కార్ హాస్పిటల్ లో పరిస్థితులను పరిశీలించడానికి వెళ్తే బీజేపీ మహిళా మోర్చా నాయకురాళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా..? అని ప్రశ్నించారు.. కోవిడ్ నిబంధనలకు లోబడి పీపీఈ కిట్స్ వేసుకుని ఆస్పత్రిలోకి వెళ్తే.. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు బనాయిస్తారా? రోజు లాక్ డౌన్…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనపై నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ సమయం చూసుకొని.. సీఎం కేసీఆర్ పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. “కరోనా రోగులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ గారు వరంగల్ ఎంజీఎంను సందర్శిస్తే… అక్కడి ప్రజలు మాత్రం జనవరి 2015 నాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళారు. నాడు ఈ నగరంలోని పలు మురికివాడల్లో పర్యటించిన సీఎం గారు వారికి కొత్త ఇళ్ళు కట్టిస్తానని, వాటిలో దావత్ చేసుకోవడానికి 5 నెలల్లో మళ్లీ వస్తానని…
ఈరోజు నుండి లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు సీపీ మహేష్ భగవత్ తెలిపారు. సడలింపు సమయంలోనే ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకోవాలని పేర్కొన్నారు. డెలివరీ బాయ్స్ టీషర్ట్స్ వేసుకొని తిరుగుతున్నారు. అలా చేసే వారి పై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఉంది. అనవసరంగా బయటికి వస్తే వాహనాలను సీజ్ చేసి లాక్ డౌన్ తర్వాత కోర్టు…
తెలంగాణలో లాక్డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నారు.. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర సరిహద్దులను పూర్తిగా మూసివేయబోతున్నారు.. సరిహద్దు దాటి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి రాకుండా.. బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి.. రాష్ట్రంలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇస్తారు. అయితే, పోలీసులు సీజ్ చేసిన వాహనాలు లాక్డౌన్…
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు. మరికొద్ది రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశించనున్న నేపథ్యంలో రైతుల వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న పరిస్థితుల్లో.. ధాన్యం సేకరణ కార్యక్రమాన్ని మరో వారం పది రోజుల్లో వేగవంతంగా పూర్తి చేయాలని సీఎం…
హైదరాబాద్ పాతబస్తీలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.. హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టలోళ్ళ బస్తీ పక్కనున్న చంద్రకాపురంలో ఈ ఘటన జరిగింది.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.. వీరి ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా అనుమానిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కరోనా…
కరోనా సమయంలో కొంతమంది అయినవారు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.. ఆదుకోవడానికి ముందుకు రావడం తర్వాత సంగతి.. కనీసం పలకరించడానికి కూడా వెనుకడుగే వేస్తున్నారు.. అయితే, ఈ సమయంలో మానవత్వం చాటుకున్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. తల్లితండ్రులు కోల్పోయిన పిల్లలకు నేరుగా ఫోన్ చేసి మేం ఉన్నామంటూ భరోసా కల్పించారు.. హైదరాబాద్‌లోని సైదాబాద్ ఎబ్బీఐ కాలనీకి చెందిన దంపతులు కరోనాత మృతిచెందారు.. ఈ నెల 13వ తేదీన భర్త జగదీష్ కన్నుమూస్తే.. 18వ తేదీన భార్య గీత ప్రాణాలు వదిలారు..…
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన.. వరంగల్ అర్బన్ కలెక్టరేట్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.. ఆయా జిల్లాల్లో పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీశారు.. ఇక, తన పర్యటనలో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన సీఎం.. కోవిడ్ రోగులతో మాట్లాడి.. వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు.. వారిలో భరోసా నింపుతూ ధైర్యాన్ని చెప్పారు..…