తెలంగాణ రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విధివిధానాలు రూపొందించనున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించనున్నారు.
ఫ్యాకల్టీ నియామకం స్టేట్ వైడ్ గా (కేంద్రీకృతంగా) అన్ని యూనివర్సిటీ లకు కలిపి, లేదా యూనివర్సిటీ వైస్ గా చేయాలా అనే దానిపై వీసీల అభిప్రాయం తీసుకుంది విద్యా మండలి. కాగా, కేంద్రీకృత నియామకాలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం వుంది. కేంద్రీకృతంగానే యూనివర్సిటీ ఫ్యాకల్టీ నియామకంకు వీసీలు ఒప్పుకున్నారు. వీసీల సమావేశం సెంట్రలైజ్డ్ నియామకాలపై ప్రభుత్వమునకు ఉన్నత విద్యా మండలి రిపోర్ట్ ఇవ్వనుంది. మరో వైపు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. తమను తీసివేయకుండా నియామకాలు చేపట్టాలని యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు కోరుతున్నారు.
కాగా, 2017 నవంబర్ 25న 11 యూనివర్సిటీల్లో మొదటి విడతలో 1061 పోస్టులు భర్తీకి అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీఓ 34 జారీ చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్ళ క్రితమే ఆమోదం తెలిపినా.. నేటికీ అవి భర్తీకి నోచుకోలేదు.