కరోనా వైరస్ ఓ వైపు కల్లోలం సృష్టిస్తుంటే.. మరోవైపు సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు.. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. తాజాగా సైబర్ కేటుగాళ్ల బాధితుల జాబితాలో ఓ 77 ఏళ్ల వృద్ధుడు చేరాడు.. సరదాగా డేటింగ్ అంటూ చాటింగ్‌తో స్టార్ట్ అయ్యి.. చివరకు రూ.11 లక్షలు పోగుట్టుకున్న తర్వాత గానీ ఆ వృద్ధుడికి తాను చీటింగ్‌కు గురయ్యాను అనే సంగతి తెలిసిరాలేదు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ 77 ఏళ్లు వృద్ధుడు.. సైబర్ కేటుగాళ్ల చేతికి చిక్కాడు.. ప్రేమ, డేటింగ్, చాటింగ్ అంటూ అంతా రహస్యంగా చాటింగ్ చేశాడు.. సరదాగా చాట్ చేసిన ఆ వృద్ధుడి నుండి 11 లక్షల రూపాయలు కాజేశారు సైబర్ చీటర్స్.. మరిన్ని డబ్బులు పంపించాలని ఒత్తిడి చేయడంతో.. తాను మోసపోయానని గమనించిన వృద్ధుడు… చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ చేపట్టారు.