గత కొన్ని రోజులగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో పాటుగా రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
Read: అమెజాన్ ప్రైమ్ లో ”టక్ జగదీష్”
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. తాడేపల్లి గూడెం, పోలవరం, గోపాలపురంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే, వాయువ్య బంగాళాఖాతంలో ఈనెల 23 వ తేదీనాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ అప్పపీడన ప్రభావంతో ఈరోజు, రేపు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.