గులాబీ తెలంగాణ.. నీలి తెలంగాణ కావాలని ఆకాంక్షించారు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్… ఇంకా సర్వీస్ ఉన్నా.. తన ఆఫీసర్‌గా ఉంటే.. ప్రజలకు నేను అనుకున్నస్థాయిలో చేరువ కాలేకపోతున్నా.. తాను అనుకున్నవిధంగా వారికి సేవ చేయలేకపోతున్నానని భావించి వీఆర్‌ఎస్ తీసుకున్న ఆయన.. తర్వాత బీఎస్పీలో చేరనున్నట్టు ప్రకటించారు.. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పర్యటించారు. ఇక, త్వరలోనే బీఎస్పీలో చేరనున్నారు. దీనికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్.. ఈ నెల 8వ తేదీన బీఎస్పీలో చేరుతున్నానని.. ఆ రోజు నల్గొండలో జరిగే బహిరంగసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. తాను ఎమ్మెల్యే కావాలనో.. మంత్రి కావాలనో.. బీఎస్పీలో చేరడం లేదని స్పష్టం చేసిన ప్రవీణ్ కుమార్.. గులాబీ తెలంగాణ.. నీలి తెలంగాణ కావాలని వ్యాఖ్యానించారు. కాగా, నల్గొండ సభను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ప్రవీణ్ కుమార్ టీమ్ ఏర్పాట్లలో మునిగిపోయింది.. ఆయనను అభినిస్తూ ఇతర పార్టీల్లో ఉన్న కొందరు నేతలు.. ఆయా పార్టీలకు రాజీనామా చేసి.. తమ ప్రయాణం ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ వెంటేనని ప్రకటిస్తున్నారు.