ప్రముఖ ట్రావెల్స్ సంస్థ సదరన్ ట్రావెల్స్‌ను తెలంగాణ స్టేట్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు వరించింది.. హైదరాబాద్ బేగంపేటలోని ఓ హోటల్‌లో తెలంగాణ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను నిర్వహించారు.. సెప్టెంబరు 27 ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పురస్కారాలను ప్రదానం చేశారు.. “బెస్ట్ ట్రావెల్ ఏజెంట్” విభాగంలో సదరన్ ట్రావెల్స్‌ను అవార్డు వరించింది.. సంస్థ ప్రతినిధులు.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. ఇక, ఈ సందర్భంగా టూరిజం మినిస్టర్ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యాటక మ్యాప్‌లో స్థానం పొందగలిగే చారిత్రక ప్రదేశాలు తెలంగాణలో ఉన్నాయని తెలిపారు.. వరల్డ్ టూరిజం మ్యాప్‌లో వాటికి చోటు దక్కేలా ప్రయత్నిస్తామన్నారు.. ఇక, పర్యాటక అభివృద్ధి కోసం ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్టు వెల్లడించారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్.