తెలంగాణాలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ ఒకటి. ప్రతి ఏడాది దసరా సందర్భంగా జరుపుకునే ఈ పండగను తెలంగాణ ప్రభుత్వం సైతం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పండుగకు ముందు ‘బతుకమ్మ’ స్పెషల్ సాంగ్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది సంగీతకారులు విభిన్న పాటలతో యూట్యూబ్ లో బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అయితే మొదటిసారిగా బతుకమ్మ పాటకు సంగీతం అందించడానికి లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ముందుకు వచ్చారు. ప్రఖ్యాత దర్శక నిర్మాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ పాటకు దర్శకత్వం వహించారు. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో బతుకమ్మ పాట చిత్రీకరణ జరిగింది. చిత్రీకరణ విజయవంతంగా పూర్తయింది. త్వరలో పాటను విడుదల చేయడానికి ఈ బృందం ప్లాన్ చేస్తోంది.
Read Also : తేజ్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన మెగా హీరో
తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన తెలంగాణ జాగృతి ద్వారా ఈ ప్రత్యేక పాట కోసం రెహమాన్, గౌతమ్ మీనన్‌లను కలిసి పాటను రూపొందించాల్సిందిగా కోరారు. తెలంగాణ జాగృతి వారసత్వం, సాంస్కృతిక పునరుజ్జీవనం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థ. ఈ పాట కోసం బతుకమ్మ ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.