తడిసిన, మొలకెత్తిన ధాన్యం విషయంలో కేంద్ర నిబంధనల మేరకే కొనుగోలు చేస్తాం అని సివిల్ సప్లై కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ఏడాది కంటే పదిలక్షల మెట్రిక్ టన్నుల అదనపు ధాన్యం కొనుగోలు చేసాం. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెట్టకపోతే ఇంకా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసే వాళ్లం. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలోను రెండు లక్షల మెట్రిక్ టన్నుల కంటే అదనపు ధాన్యం కొనుగోలు చేయలేదు కేంద్ర నిబంధనలకు నిరసనగా ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసింది. అందుకే అనేక జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలను కూడా మూసి వేసాం. నిజామాబాద్ లో వందశాతం.. మరికొన్ని జిల్లాలో 90 శాతం కేంద్రాలు మూసి వేసాం అని చెప్పారు.
అలాగే పియూష్ గోయల్ బియ్యం ఇవ్వడంలో తెలంగాణ విఫలం అయ్యింది అనడం బాధాకరం. ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో రెండు నెలలు మిల్లింగ్ ఆపేస్తున్నారు. స్టోరేజ్ సామర్థ్యం కూడా పెంచడం లేదు… వ్యాగన్ సంఖ్యను కూడా పెంచడం లేదు. రైస్ మిల్లర్లు తప్పులు చేస్తే శిక్షించేందుకు సిద్దంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి పవిత్రమైన పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అబద్ధాలు చెబుతున్నారు. మోడీ వచ్చిన తరువాతనే సేకరణ విధానం రాలేదు.. గతంలో కూడా ఈ విధానం ఉండేది. ప్రతీ ఏట వంద రైస్ మిల్లులు కొత్తగా వచ్చాయి.. మిల్లింగ్ సామర్థ్యం పెరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మొత్తం అబద్ధాలు మాట్లాడారు. గన్ని బ్యాగ్ లే గతి లేవు అంటున్నారు. 13.50లక్షల బ్యాగులు కావాలని కోరాం. కేవలం 6.90లక్షల బ్యాగులు మాత్రమే ఆర్డర్ ఇచ్చారు. సీజన్ ప్రారంభానికి ముందే 7కోట్ల బ్యాగ్ లతో సిద్దంగా ఉన్నాం. 30.20పైసలకు పాత బ్యాగులు కొనుగోలు చేసాం. 8కోట్ల గన్ని బ్యాగులు ఇలా కొనుగోలు చేసాం. గత యాసంగిలో 23కోట్ల గన్ని బ్యాగులు తెచ్చాం. ట్రాన్స్పోర్ట్ ను కూడా కొత్తగా కాంట్రాక్టర్లను తీసుకుంటే సమయం ఎక్కువ పడుతుందని పాత వారితోనే మాట్లాడి రవాణా చేస్తున్నాం. రైతాంగం అంటే కేసీఆర్ కు అపారమైన గౌరవం ఉంటుంది అని పేర్కొన్నారు.