కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ మీ గుండెలు కరుగటం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవా ? అంటూ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే, మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి…
మల్లా రెడ్డి యూనివర్సిటీ (ఎంఆర్‌యూ) మోటివిటీ ల్యాబ్స్‌తో కలిసి టెక్నో ఇన్నోవేషన్ సెంటర్‌ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం యొక్క ప్రాథమిక లక్ష్యం ఇంటర్న్‌షిప్‌ల ద్వారా విద్యార్థులకు తమ సమయాన్ని మనస్పూర్తిగా అనుభవించే అవకాశాన్ని అందించడం మరియు సాంకేతిక ఆవిష్కరణ మరియు సృజనాత్మకతను స్ఫూర్తిని పెంపొందించడం ప్రధాన లక్ష్యం. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం వారు తమ గ్రాడ్యుయేట్లకు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో పని చేయడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానాన్ని అందించే వినూత్నమైన, పరిశ్రమ-సంబంధిత విద్యను…
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం ఇంటర్ లో 70 శాతం సిలబస్ ఉండనున్నట్లు ప్రకటన చేసింది. ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 70 శాతం సిలబస్ నుండే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. కోవిడ్ నేపథ్యం, విద్యా సంస్థలలో భౌతిక తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో 70 శాతం సిలబస్ తోనే విద్యా సంవత్సరం నిర్వహిస్తామని తెలిపింది. ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ లో ఈ సిలబస్ గురించి…
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బరిలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటన చేశారు. కాసేపటి క్రితమే… అసెంబ్లీకి వచ్చిన… ఆరుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు…. ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి సర్టిఫికెట్ తీసుకున్నారు. కడియం శ్రీహరి, గుత్తా, బండ ప్రకాష్, రవీందర్, వెంకట్రామిరెడ్డి, కౌశిక్ రెడ్డి సర్టిఫికెట్ తీసుకున్న వారిలో ఉన్నారు. ఇక ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…. ఆరు ఎమ్మెల్సీలూ ఏకగ్రీవమయ్యాయని.. మాకు అవకాశం…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై డీకే ఆరుణ కీలక ఆరోపణలు చేశారు. దళిత బంధు, హుజురాబాద్ ఎన్నికల విజయం నుంచి ప్రజల దృష్టిని మరళ్లించేందుకు రైతు ధర్నాలు, ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రైతు చట్టాలపై కేంద్రం మెడలు వంచుతా అని మాట్లాడుతున్న కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ఓట్లు, సీట్లు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం కేసీఆర్‌కు లేదని డీకే అరుణ ఆరోపణలు చేశారు. Read: కొన్ని…
స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ అనంతరం మీడియాతో ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… అన్ని ఎమ్మెల్సీ స్థానాల గెలుపు నల్లేరు మీద నడకే. ఎంపీటీసీల గౌరవ వేతనం పెంచాం, ఇంకా పెంచుతాం. ఎంపీటీసీలకు నిధులు కేటాయిస్తాం అన్నారు. ఇక తమను రెచ్చగొట్టే నేతలకు ఎంపీటీసీలు సరైన సమాధానం చెప్పాలి. ఏకగ్రీవం అయ్యేలా అందరూ కృషి చేయాలి అని తెలిపారు. ఆ తర్వాత మంత్రి సత్యవతి రాథోడ్ మట్కాడుతూ… వరంగల్ జిల్లా…
హుజూరా బాద్ ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఓటర్లందరికి డబ్బులు పంచిన అధికార పార్టీ పోయింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వివిధ పార్టీల నేతలను కొనుగోలు చేశారు… ఓటర్లను ప్రలోభ పెట్టె అన్ని పనులు చేశారు. ప్రభుత్వ యంత్రాంగం అంత హుజూరాబాద్ లో పని చేసినది… హుజూరాబాద్ లో స్టేట్ సెక్రటేరియట్ ఉందా అనే విదంగా చేశారు. సీఎం విలేజ్ వైస్ మానిటరింగ్ చేశారు కేసీఆర్ కుటుంబందే, మా బెదిరింపు లదే విజయం…
తెలంగాణ ప్రభుత్వానికి రైతుల (అమరవీరుల) జాబితాను ఇస్తామని “సంయుక్త కిసాన్ మోర్చా” తెలిపింది. రైతు ఉద్యమంలో సుమారు 700 మంది రైతులు చేసిన త్యాగాలను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వం గుర్తించనప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు మద్దతునిచ్చేందుకు ముందుకు వచ్చింది. అమరవీరుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కూడా ప్రతి రైతు కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం రూ.25 లక్షలు చెల్లించాలని, రైతులపై అన్ని కేసులను…
తెలంగాణ కాంగ్రెస్‌లో వారిని దారిలోకి తేవడం ఎవరి వల్లా కావడం లేదా? సీనియర్ నాయకుడు చేపట్టిన రాయబారం ఎంత వరకు వచ్చింది? రావాలని ఉన్నా.. పార్టీ అగ్రనాయకులు ఆయన్ని లైట్ తీసుకున్నారా..? తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కోమటిరెడ్డి సోదరులతో వీహెచ్ రాయబారం..! కొన్ని రోజులుగా తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ ఎంపీ వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ వాళ్లను వదులుకోలేదు.. అలాగని వాళ్ల గుమ్మం వరకు వెళ్లి…
పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్లో విషాదం జరిగింది. రైలుకు ఎదురుగా నిలబడి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఒడిశాకు చెందిన వలస కూలీ సంజయ్ కుమార్‌గా అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి రైలులో రామగుండం రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలస కూలీ సంజయ్ కుమార్.. అందరూ చూస్తుండగా ఒక్కసారి ట్రాక్ మీదకు వెళ్లి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు ఎదురుగా నిలబడ్డాడు. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. మృతుడి మానసిక…