నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏక గ్రీవం గా ఎన్నిక అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో లేకపోవడంతో… టీఆర్ఎస్ పార్టీ ఏక గ్రీవంగా విజయం సాధించింది. అయితే.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్ ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇక…
బలం ఉన్నచోట బరి.. బలం లేనిచోట ప్రత్యర్థిపై గురి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహం ఇదేనా? అన్నిచోట్లా కాకుండా.. కొన్నిచోట్లే పోటీ చేయడం వెనక నాయకుల మతలబు ఏంటి? అప్పనంగా అధికారపార్టీకి కట్టబెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏంటా పార్టీ? వారు వేస్తున్న లెక్కలేంటి? నల్లగొండలో నేతల మధ్య కుదరని సయోధ్య..! తెలంగాణ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఖమ్మంలో రాయల్ నాగేశ్వరరావు, మెదక్లో నిర్మలా జగ్గారెడ్డికి బీఫామ్…
మంత్రి కావాలన్న ఆ సీనియర్ నేత కల కలేనా? ఇప్పట్లో ఆ యోగం లేనట్టేనా? రెండోసారి శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న ఆయనకు పాత పదవే మళ్లీ కట్టబెడతారా? దానికి ఆ సీనియర్ ఒప్పుకొంటారా? గుత్తాకు ఇచ్చే కొత్త పదవిపై చర్చ..! తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు గుత్తా సుఖేందర్రెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్కు ఆ తర్వాత టీఆర్ఎస్కు వచ్చారు. గులాబీ కండువా కప్పుకొన్న సమయంలో గుత్తాను మంత్రివర్గంలోకి…
పోటీ ఉంటే ఎన్నికల్లో ఖర్చు అంచనాలను మించిపోతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ల్లో ఏకగ్రీవం అయ్యేచోట కూడా అభ్యర్థులకు కోట్లకు కోట్లు చేతి చమురు వదిలిపోతోందట. వీటికితోడు క్యాంపు రాజకీయాలకు ముందస్తున్న సన్నాహాలు ఊపందుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. 12 లోకల్ ఎమ్మెల్సీ స్థానాల్లో 9 వేల మందికిపైగా ఓటర్లు..!క్యాంప్ రాజకీయాలకు ముందస్తు ఏర్పాట్లు..! తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న 12…
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ మిగిలింది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్లను టీఆర్ఎస్ మద్దతుదారులు చించివేయడంతో రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. నామినేషన్ల గడువు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగిసింది. అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ…
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 27 మంది 53 సెట్లు నామినేషన్లు దాఖలు చేసారు. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. టీఆర్ఎస్ తరపున ఎల్ రమణ, బాను ప్రసాద్ రావులు నామినేషన్ వేశారు. అయితే ఈ పోటీకి దూరంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నియోజకవర్గాల వారిగా…
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇందులో 131 ఆస్తులు ఉన్నాయని వారు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులను మనీ లాండరింగ్ కింద అటాచ్ చేసినట్లు వారు వివరించారు. వీటిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. ఆస్తులే కాకుండా…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబానికి దేశభక్తి ఉన్నదా…? అరుణాచల్ ప్రదేశ్ పై ఏమి మాట్లాడారని నిలదీశారు డీకే అరుణ. మీకు ఉన్నదంతా ప్రజల్లో సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలి… దానితో బతకాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఎన్ని వేషాలు వేసిన తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఎద్దేవా చేశారు. ఇంట గెలిచి రచ్చ గెలువు… తెలంగాణ రైతులు ఆత్మహత్య లు చేసుకుంటే కుటుంబాలను పరామర్శించలేదు… పంజాబ్ రైతుల గురించి మాట్లాడుతున్నావని…
మల్లారెడ్డి యూనివర్శిటీ మరియు మోటివిటి ల్యాబ్స్ సహకారంతో టెక్నో ఇన్నోవేషన్ కేంద్రాన్ని మల్లారెడ్డి యూనివర్శిటీ వ్యవస్థాపక చైర్మన్ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు ఉన్నత విద్య తో పాటు ఉపాది అవకాశాలుతో పాటు విద్యార్థులు చదువుకొంటూనే ఉద్యోగ అవకాశాలు, సాంకేతిక పరమైన ఆలోచనలు పరస్పరం పంచుకోవడం, ఇంటర్న్ పిప్ ల ద్వారా పరిశ్రమల వాతావరణం అనుకూలంగా ఉంటేట్లు ఏర్పాటు చేస్తూ వారికి శిక్షణ అందిస్తామని ,,ఇన్నోవేషన్ & స్టార్ట్ అప్ లను ప్రోత్సహిస్తూ వారి ఆలోచనలకు వాణిజ్యీకరణ…