వరి కొనుగోళ్ల వ్యవహారం ఇప్పటికే తెలంగాణ సర్కార్, కేంద్రం మధ్య నిప్పు రాజేసింది.. మార్కెట్ యార్డులతో పాటు.. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వరి ధాన్యం దర్శనమిస్తోంది.. దయచేసి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి మొర్రో అంటూ రైతులు వేడుకున్నా ఫలితం దక్కని పరిస్థితి ఉంది.. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వరి ధాన్యాన్ని తరలిస్తున్నారు.. Read Also: చంద్రబాబు అసెంబ్లీ నుంచి పారిపోయింది అందుకే..! అయితే, రాష్ట్ర సరిహద్దుల్లో ఆ లారీలను అడ్డుకున్నారు తెలంగాణ అధికారులు..…
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు… టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేసిన ఆయన.. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు.. అయితే, పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్కు లేఖరాసిన గట్టు రామచంద్రరావు… “నేను మీ అభిమానాన్ని పొందడంలో.. గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యాను.. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని భావించాను.. అందుకే పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు..…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…
ఉపఎన్నికలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన తేరా చిన్నపరెడ్డికి ఎందుకు రెన్యువల్ చేయలేదు? తేరా వర్గానికి ఎక్కడ తేడా కొట్టింది? అధికారపార్టీ నిర్ణయంపై చిన్నపరెడ్డి వర్గం స్పందన ఏంటి? తేరా ప్లేస్లో కోటిరెడ్డి అభ్యర్థి..! ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన ఆయన భారీగా ఖర్చు చేశారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోగా.. తర్వాత రెండేళ్లకు వచ్చిన ఉపఎన్నికలో గెలిచారు.…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఉన్నారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఏకగ్రీవమైనవారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారులు అందజేస్తారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు.…
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కిడ్నీ వాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి హరీష్రావు వెల్లడించారు. ఈ రెండు ప్రాంతాల్లో తక్షణమే డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎయిడ్స్ రోగులకు 5, హెపటైటిస్ రోగుల కోసం మరో 5 పడకలను కేటాయించాలన్నారు. Read Also: తెలంగాణ…
ప్రముఖ గాయకుడు కిన్నెర మొగులయ్యను తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించాడు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని… పాట పాడినందుకు గానూ… కిన్నెర మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించాడు. ఆర్టీసీని కిన్నెర మొగులయ్య ప్రమోట్ చేస్తూ.. పాట పాడటం చాలా మంచి విషయమని ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. అయితే.. గత రెండు రోజుల కింద కిన్నెర మొగులయ్య ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితంటూ పాట పాడాడు. ఆ పాట రెండు రోజుల…
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నుంచి… ఆర్టీసీలో సమూల మార్పులు వచ్చాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాటల్లో దూసుకుపోతుంది. అటు ప్రజలు కూడా ఆర్టీసీ సేవలను ఉప యోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టగలుగుతోంది.తాజాగా ఒక్కరోజే ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని రాబట్టింది. సోమవారం రికార్డు స్థాయిలో 77.06 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది ఆర్టీసీ. గత సంవత్సరం ఆర్టీసీ…
రూల్ అంటే రూలే.. అవి ఎవరు బ్రేక్ చేసినా వదిలేదు లేదు.. ట్రాఫిక్ నిబంధనలు ఎవరు పాటించకపోయినా ఫైన్ తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు.. ఒకప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారిని అక్కడే ఆపి కౌన్సిలింగ్ ఇవ్వడం, చలానాలు రాయడం జరిగేది.. కానీ, ఇప్పుడు రూట్ మార్చేశారు ట్రాఫిక్ పోలీసులు.. కూడళ్ల దగ్గర ఓ పక్కన నిలబడి ట్రాఫిక్ రూల్స్ పాటించనివారిని ఫొటో తీసి చలానాలు వడ్డిస్తున్నారు. ఇక, ఉన్నతాధికారులకు అక్కడక్కడ మినహాయింపులు ఇచ్చేవారేమో.. కానీ, ఇప్పుడు కామారెడ్డి…
ఏపీలో భారీ వర్షాల కారణంగా టమోటాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద దాటిపోగా ఇప్పుడు టమోటాల ధరలు కూడా వంద దాటిపోయాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ అయిన మదనపల్లిలో కిలో టమోటా ధర ఏకంగా రూ. 130 పలుకుతున్నది. వి.కోట మార్కెట్లో 10 కేజీల టమోటాలు రూ.1500 పలుకుతున్నాయి. భారీ వర్షాలు కురవడంతో పంట పాడైపోవడంతో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వర్షాలు తగ్గి, వరద ఉధృతి పూర్తిగా తగ్గి మళ్లీ కొత్త…