ఇప్పటికే పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తూ వస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్.. వరుసగా పెరుగుతూ సామాన్యుడికి గుది బండగా మారిన పెట్రో ధరలపై గురు పెట్టారు.. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ బహిరంగలేఖ రాశారు.. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని గప్పాలు చెప్పుకునే మోడీ గారి పాలనలో సబ్ కా సత్తేనాశ్ అయ్యిందని దుయ్యబట్టారు.. అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు పెరిగినా తగ్గినా దేశంలో రేట్లు పెంచడమే…
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రిమాండ్ రిపోర్ట్‌లో పూర్తి విషయాలను పేర్కొన్నారు బంజారాహిల్స్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు పబ్‌కు సంబంధించిన సమాచారం వచ్చిందని.. రాడిసన్ బ్లు హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో తెళ్లవరజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నరేని సమాచారం అందిందని.. ఈజీ మనీ కోసమే నిర్వాహకులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. విశ్వసనీయ సమాచారం…
తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర సర్కార్ మధ్య వరి కొనుగోళ్ల వ్యవహారం విషయంలో మాటల యుద్ధం నడుస్తూనే ఉంది… వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం దిగొచ్చి క్షమాపణ చెప్పేవరకు వదిలేదిలేదని ప్రకటించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. జనగామ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం.. యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రా రైస్ కోసం కేంద్ర ప్రభుత్వం డ్రామా చేస్తోందని మండిపడ్డారు..…
గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చారు అధికారులు.. ఇప్పటి వరకు ఉన్న ఇంటర్వ్యూల ప్రాసెస్‌ను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఫైల్‌ను సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్‌ను పంపించింది.. కాగా, గ్రూప్ వన్‌లో ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి వంద మార్క్‌లు ఉండగా.. గ్రూప్‌లో ఇంటర్వ్యూలకు 75 మార్క్‌లు ఉన్నాయి.. Read Also: New Born Baby: ఆడపిల్ల పుట్టిందని…
ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తోంది.. ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ధరలు తగ్గే వరకు విద్యుత్ చార్జీలు తగ్గే వరకు, రైతులు పండించిన పంటలు చివరి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటాలు సాగుతాయన్నారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ రోజు అన్ని జిల్లా…
గోవా.. పేరు చెబితే బ్యాంకాక్ వెళ్ళినంత హ్యాపీగా ఫీలవుతారు యువత. నెలకు కనీసం మూడునెలలకు ఒకసారైనా గోవాకు వెళ్ళాలని యువత అనుకుంటారు. అవకాశం దొరికితే చాలు వ్యాలెట్ నిండా డబ్బులతో గోవా చెక్కేస్తారు. రెండుమూడురోజులు అక్కడే వుండి ఫుల్ గా ఎంజాయ్ చేసి వస్తారు. గోవాకు టూరిస్టులను తీసుకెళ్లేందుకు కూడ డ్రైవర్లు ఆసక్తి చూపిస్తారు. గోవాకు వెళ్లిన ఓ డ్రైవర్ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గోవా డ్రైవ్ శ్రీనివాస్ అపస్మారక స్థితికి చేరుకోవడం, అతని…
https://youtu.be/yrr4FjSUabc లక్ష్మీపంచమి ఎంతో శుభప్రదమయిన, యోగదాయకమయిన రోజు. ఈరోజు బుధవారం. అమ్మవారి స్తోత్రపారాయణం చేస్తే సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయి.
రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా చెలరేగిపోతోందని, అయినా సీఎం కేసీఆర్ దాని గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలన అంతానికి… ఇదే ఆఖరి పోరాటం. ప్రజలంతా బీజేపీకి అండగా ఉన్నారు. తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం అన్నారు బండి సంజయ్. ఢిల్లీలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి తరుణ్ చుగ్, బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు…
నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీరు విడుదల చేస్తోన్న తెలంగాణ తీరుపై ఏపీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ చేస్తోన్న నీటి విడుదలను అడ్డుకోవాలని కేఆర్ఎంబీకి లేఖ రాశారు ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ నారాయణ రెడ్డి. లేఖలో ఏపీ ఇరిగేషన్ ఈఎన్సీ కోరారు. వేసవిలో తాగు నీటి అవసరాలకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ నీటిని దుర్వినియోగం చేస్తోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం ముందస్తు అనుమతి లేకుండా నాగార్జునసాగర్…
అడవుల్లో వుండాల్సిన చిరుతపులులు జనావాసాల్లోకి, పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో పంట పొలాల్లోకి వెళ్ళాలంటేనే రైతులు భయంతో బిక్కు బిక్కుమంటున్నారు..రోజుఎక్కడో ఒకచోట చిరుతల సంచారం కలకలం రేపుతోంది..ఒక్కరోజు మూడు చిరుతలు రైతుల కంటపడడం కేకలు పెడితే అవి అడవిలోకి పారిపోయాయి.. మరుసటిరోజు మరోచోట లేగదూడను చంపేశాయి చిరుతలు. నిర్మల్ జిల్లాలో చిరుత సంచారం పెరిగిందా? లేక వలస వచ్చిన చిరుతలే సంచరిస్తున్నాయా అనేది అంతుచిక్కడం లేదంటున్నారు స్థానికులు. నిర్మల్ జిల్లాలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతలు రైతులను…