Bandi Sanjay: సీఎం కేసీఆర్ కి బండి సంజయ్ బహిరంగలేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వడ్ల కొనుగోలు, కాంటాలను వెంటనే ప్రారంభించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి బహిరంగలేఖ రాశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ తెలంగాణ శాఖ చేసిన అనేక ఉద్యమాలకు తలవొగ్గే మీరు వడ్లు కొనడానికి ముందుకు వచ్చారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రతీ వడ్ల గింజ కొంటామని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం అనంతరం మీరు ఆర్భాటంగా ప్రకటించి 15 రోజులు కావస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే మీ ప్రకటన కేవలం ఉత్తర కుమారుని ప్రగల్భాలేనని స్పష్టం అవుతోంది. ఇప్పటికైనా మీరు కళ్లకు కట్టుకున్న గంతలు తీసేసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషిచేయాలని బీజేపీ తెలంగాణ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న నాకు అనేక మంది రైతులు వచ్చి కొనుగోళ్ళ కేంద్రాలు ప్రారంభించలేదని, దీనివల్ల వారు పడుతున్న ఇబ్బందులను నా దృష్టికి తీసుకొని వచ్చారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాల్ లో 71 కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం రెండు కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. అదేవిధంగా వనపర్తిలో 225 కేంద్రాలకు 19 కేంద్రాలు, నారాయణపేట్‌లో 91 కేంద్రాలకు 70 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కాంటా పెడుతున్నది మాత్రం నామామాత్రం. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల కేంద్రాలు ప్రారంభించాల్సి వుండగా కేవలం 2,500 కేంద్రాలు మాత్రమే ప్రారంభించారు.
Also Read
రాష్ట్రప్రభుత్వం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి వుండగా కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటివరకు కొన్నది. దీన్ని బట్టే రాష్ట్రప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉన్నదో స్పష్టం అవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించటమే కాకుండా ప్రతీ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కాంటా ఏర్పాటుచేసి ప్రతీ ఒక్క గింజ కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్రశాఖ తరుపున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కాంటాలు ఏర్పాటు చేయకపోతే రైతాంగం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతులు వడ్లను తీసుకొని కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వాటిని కొనుగోలు చేయకపోవడంవల్ల వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను, కాంటాలను ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలని రైతులకు అవసరమైనంత గోనుసంచులను సేకరించాలని, రైతుల నుంచి సేకరించిన వడ్లకు వెంటనే చెల్లింపులు చేయాలని, అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనాలని బిజెపి తెలంగాణ శాఖ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుకయ్యే ప్రతి పైసా ఖర్చును కేంద్రప్రభుత్వమే చెల్లిస్తున్నందున రాష్ట్రప్రభుత్వం ఎటువంటి అలసత్వాన్ని చూపించకుండా ధాన్యం కొనుగోలుకు యుద్ధప్రాతిదికన చర్యలు చేపట్టాలి.
రాష్ట్రప్రభుత్వం సేకరించిన వడ్లను బియ్యంగా మార్చి కేంద్రప్రభుత్వానికి ఇస్తే పూర్తిగా తీసుకోవడానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్రప్రభుత్వం వెంటనే ఆలస్యం చేయకుండా కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొస్తున్న ప్రతీ ఒక్క వడ్ల గింజను కొనుగోలు చేయాలని రైతులపక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రప్రభుత్వం ప్రతీ గింజ కొనేవరకు, వారికి చెల్లించాల్సిన సొమ్ములను చెల్లించే వరకు రైతులు పక్షాన బీజేపీ శాఖ తెలంగాణ శాఖ పోరాడుతుందన్నారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!