టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా జాతీయ రాజకీయాలపై కీలక ప్రకటన చేశారు అధినేత కేసీఆర్. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ప్లీనరీ తీర్మానం చేసింది. ప్రత్యమ్నాయ ప్రజల అజెండాతో అమెరికా తరహా అభివృద్ధి సాధ్యమన్నారాయన. రాబోయే ఎన్నికల్లో తొంభై శాతం సీట్లు తామే గెలుస్తామని కుండబద్దలు కొట్టారు కేసీఆర్. ఈ ప్లీనరీలో మొత్తంగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టారు. అలాగే కేంద్రంపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కేసీఆర్. రాష్ట్రం…
హైదరాబాద్‌లో అత్యంత భద్రత నడుమ జరుగుతోన్న టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు.. ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు మున్నూరు రవి.. అయితే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న రవి… ప్లీనరీలో కనిపించడం చర్చగా మారింది.. మరోవైపు, హై సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులు ఇచ్చినా.. ఎలా మున్నూరు రవి ప్లీనరీకి వచ్చారని అరా తీశారు పార్టీ శ్రేణులు.. కానీ, ఐడెంటిటీ కార్డ్ తోనే ప్లీనరీ హాల్లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొందరు…
దేశవ్యాప్తంగా పెట్రో ధరలపై చర్చ సాగుతూనే ఉంది.. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు.. బీజేపీయేతర పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రో ధరలు ఎలా ఉన్నాయో తెలుపుతూ.. పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి.. ఇక, తెలంగాణలో పెట్రో ధరలకు కారణం ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీయేనని బీజేపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ కూడా తెలంగాణ పేరు ప్రస్తావించడంలో మంత్రి కేటీఆర్‌కు చిర్రెత్తుకొచ్చినట్టుంది.. దీంతో.. ప్రధాని మోడీకి సోషల్ మీడియా…
వికారాబాద్ జిల్లా తాండూరులో అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆ స్థానం నుంచి పోటీ చేసి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి చెందగా.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన పైలట్ రోహిత్ రెడ్డి.. ఆ తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, మహేందర్‌రెడ్డిని ఎమ్మెల్సీని చేశారు సీఎం కేసీఆర్.. అయితే, పలు సందర్భాల్లో ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న విభేదాలు బహిర్గతం అయ్యాయి.. మరోవైపు.. ఈ ఇద్దరు నేతల…
దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిసి తమతో చేతులు కలపాలని కోరినట్లు ప్లీనరీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే తాను వాళ్లతో రానని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎవరినో గద్దె ఎక్కించేందుకు లేదా గద్దె దించేందుకు తాను పనిచేయనని చెప్పారు. గద్దె ఎక్కించాల్సింది రాజకీయ పార్టీలను కాదు అని.. ప్రజలను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. ప్రజల జీవితాలు అని…
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలను ప్రస్తావిస్తే కేసీఆర్ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే…
హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీ వేదికగా టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ ఛైర్మన్లు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ మేయర్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ఒక్కొక్కరుగా హాజరవుతున్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం 13 తీర్మానాలు చేయనుంది. జాతీయ రాజకీయాలపై మంత్రి కేటీఆర్ తీర్మానం చేయనున్నారు. వరి కొనుగోలుపై మంత్రి నిరంజన్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. ధరల పెరుగుదలపై పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానం చేయనున్నారు. మరోవైపు కేంద్ర పన్నుల వాటాపై…
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా జెండా పండగ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు వారి వారి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండాలను ఎగురవేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగాపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్..…
★ ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. మే 9వ వరకు జరగనున్న పరీక్షలు.. హాజరుకానున్న 6,22,537 మంది విద్యార్థులు.. 3,776 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు ★ అమరావతి: ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో సీఎం జగన్ కీలక భేటీ.. 2024 ఎన్నికలే అజెండాగా…
ఎంత నిఘా పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ దందా కొనసాగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. ఎందుకంటే.. ఎప్పకప్పుడు భారీ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి.. ఇక, ఇవాళ సినీ ఫక్కీలో ఓ వ్యక్తి కడుపు డ్రగ్స్ దాచి తరలిస్తున్నాడు.. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి కొకైన్ క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. రూ.12 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ ప్రయాణికుడు అనుమానాస్పదంగా…