ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించకపోయినా.. అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రంలో రోడ్లు, కరెంట్ పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని రేపుతున్నాయి.. కేటీఆర్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇక, ఇవాళ ప్రగతి భవన్‌కు వచ్చి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని కలిసిన మంత్రి ఆర్కే రోజా.. ఆ తర్వాత కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించారు.. ఏపీ గురించి కేటీఆర్ మాట్లాడలేదు అనుకుంటున్నా.. పొరుగు రాష్ట్రం అన్నారు.. ఆంధ్రప్రదేశ్ కాదు అనుకుంటానన్నారు.…
కేటీఆర్ వ్యాఖ్యలపై వరుసగా స్పందిస్తున్నారు ఏపీ మంత్రలు.. ఢిల్లీలో మీడియాతో మట్లాడిన మంత్రి అమర్నాథ్.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాష్ట్రం గురించి కాదను కుంటా అంటూనే కౌంటర్ ఇచ్చారు.. ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడితే, కేటీఆర్ తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బస్సులు పంపుతాం అంటే, పంపండి.. మేం కూడా పంపిస్తాం అన్నారు.. ఏపీకి వచ్చి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి చూడండి, వాలంటైర్ వ్యవస్థ చూడండి, గ్రామ సచివాలయ వ్యవస్థను చూడండి, గాంధీజీ…
తెలంగాణ మంత్రి కేటీఆర్ పరోక్షంగా ఆంధ్రప్రదేశ్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.. ఇక, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఏపీలో విద్యుత్ కోతలు లేవని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యలతో కొన్నిసార్లు విద్యుత్ పోవచ్చు.. కానీ, కోతలు లేవన్నారు.. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయని వెల్లడించారు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే…
అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా పరిస్థితి ఉందంటూ ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్నే రేపుతున్నాయి.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కేటీఆర్ అయినా.. ఎవరైనా.. మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలని.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు, సుమారు…
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రచ్చగా మారాయి.. అధికార పార్టీ నేతలు కేటీఆర్‌పై ఫైర్ అవుతుంటూ.. ప్రతిపక్షాలు మాత్రం నూటికి నూరు శాతం ఇది నిజం.. కేటీఆర్ వాస్తవాలే మాట్లాడారని పేర్కొన్నారు.. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేశారు.. Read Also: Breaking:…
మున్నూరు రవికి ప్లీనర్ ఎంట్రీ పాస్ ఎవరు ఇచ్చారు? మున్నూరు రవి. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర చేసిన కేసులో కీలక నిందితుడు. అలాంటి వ్యక్తి టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ పండక్కి వెళ్లాలని ఎంతోమంది గులాబీ కార్యకర్తలు ప్రయత్నించినా.. నియోజకవర్గాల నుంచి కొందరినే ఎంపిక చేశారు. వారికే ఆహ్వానాలు వెళ్లాయి. ఎమ్మెల్యేలు పంపిన జాబితాను వడపోసి.. లిమిటెడ్గానే ఇన్విటేషన్లు పంపారు నేతలు. ప్లీనరీకి వచ్చేవాళ్లకు బార్‌కోడ్‌తో కూడిన పాస్‌లు ఇచ్చారు. ప్లీనరీ ప్రాంగణంతోపాటు.. ప్లీనరీ…
సోమారపు సత్యనారాయణ. రామగుండం మాజీ ఎమ్మెల్యే. కండువా మార్చినా ఆయనకు పట్టు చిక్కడం లేదట. ఇన్నాళ్లూ ఏ పార్టీలో ఉన్నా.. నిత్య పోరాటమే చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా.. కొత్తగా వచ్చిన నేతలతో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదట. దీంతో సొంత గూటిని వదిలి తప్పు చేశామా అని ఆలోచన చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం అక్కడా ఖాళీ లేకపోవడంతో మరోసారి స్వతంత్రంగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నారట సోమారపు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ…
హైదరాబాద్‌లోని మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలపై సెటైర్లు వేశారు. కొద్దిరోజుల క్రితం తన మిత్రుడు పండగకు పక్క రాష్ట్రం వెళ్లి వచ్చారని.. వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశారని.. అక్కడ నాలుగు రోజులు ఉండగా కరెంట్ లేదని.. నీళ్లు లేవని.. రోడ్లు సరిగ్గా లేవని చెప్పారని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలోని వాళ్లను నాలుగురోజులు బస్సుల్లో పక్క రాష్ట్రానికి పంపాలని.. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం…
తెలంగాణలో జూన్ రెండో వారం నాటికి కరోనా కేసుల ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు సుమారు 40 కేసులు నమోదవుతున్నాయి. వీటి సంఖ్య జూన్ రెండో వారం నాటికి రోజుకు 2,500 నుంచి 3వేల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఈ దశను ఫోర్త్ వేవ్ అని కూడా భావించవచ్చని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు స్వల్పంగానే ఉంటాయన్నారు. ఫోర్త్ వేవ్…