కేసీఆర్ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి. ఏపీలోనే సోలార్ పవర్ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు..…
డబ్బు చెల్లిస్తారా? అప్పీల్‌కు వెళ్తారా? స్మితా సబర్వాల్. తెలంగాణ సీఎంవో కార్యదర్శి. హైకోర్టు ఆదేశాలతో తాజాగా చర్చల్లోకి వచ్చారు ఈ మహిళా ఐఏఎస్. 90 రోజుల్లో ప్రభుత్వానికి ఆమె 15 లక్షలు కట్టాలి. లేకపోతే ప్రభుత్వమే ఆమె నుంచి ఆ మొత్తాన్ని వసులు చేయాలన్నది ధర్మాసనం ఆదేశాలు. దీంతో ఈ కేసు పూర్వాపరాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం 15 లక్షలు స్మితా సబర్వాల్ ప్రభుత్వానికి కడతారా? లేక అప్పీలుకు వెళ్తారా? ఈ అంశంలో…
మండువేసవిలో భాగ్యనగరంలో వాన బీభత్సం సృష్టించింది. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని పలు కాలనీలు జలమయం కావడం మనం చూశాం. తాజాగా కురిసిన వర్షం కారణంగా కాలనీలు చిన్నపాటి చెరువులను తలపించాయి. హైదరాబాద్ లో కురిసిన భారీవర్షానికి బోట్లను వినియోగించడం కనిపించింది. పాతబస్తీ బాబా నగర్ లో యువకులు కొందరు బోట్లతో షికారు చేస్తూ కనిపించారు.హైదరాబాద్ బోట్ల వినియోగం గతంలోనూ కనిపించింది. వర్షాకాలం వస్తే బోట్లు అందుబాటులోకి తేవాలని కాలనీ వాసులు గతంలో కోరిన సందర్భాలున్నాయి. ఒకవైపు కాలనీల్లో…
తెలంగాణ-ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కోసం నేను ఎన్నోసార్లు తీవ్ర ప్రయత్నం చేశానన్నారు మాజీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని. విజయవాడలో లారీ ఓనర్ల సంఘం సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ కోసం మూడేళ్లుగా మేము చేయని ప్రయత్నమంటూ లేదు.ఆర్టీసీకి కాకపోయినా లారీ ఓనర్లకైనా పర్మిట్లు ఇప్పించాలని తీవ్రంగా ప్రయత్నించా. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక తెలంగాణ లారీ ఓనర్లే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు.ఏపీ ప్రభుత్వానికి ఎంత నష్టం వచ్చినా…
https://www.youtube.com/watch?v=qPryyU6BsU0 ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి…బుధవారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.
తెలంగాణలో బీజేపీ కేంద్ర పార్టీ చాప కింద నీరులా తమ యాక్టివిటీ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సెంట్రల్ టీంలు తెలంగాణలో మకాం వేసాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ఇక, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉమ్మడి జిల్లాకో ఇంచార్జ్ ని కేంద్ర పార్టీ నియమించబోతుంది అని తెలుస్తుంది… ఈ ఇంచార్జ్ లు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఉంటారని సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని పార్టీ.. కొన్ని టీమ్‌లను తెలంగాణ పంపిందని టాక్. ఆ టీమ్‌లు…
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఇప్పటికే 45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది గంటల కల్లా మాడు పగిలేలా ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. తెలంగాణలో ఒక్కరోజు వ్యవధిలోనే వడదెబ్బకు గురై నలుగురు మృతిచెందారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్…
అక్షయ తృతీయ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా ప్రభావంతో గత రెండేళ్లు అక్షయ తృతీయ కళ తప్పగా.. ఈ ఏడాది మాత్రం బంగారం విక్రయాలు పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలోని జ్యువెలరీ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే సందట్లో సడేమియా లాగా పలు షాపుల్లో యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారు.…
తెలంగాణలో టీడీపీపై ఫోకస్ పెడుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. లీడర్లందరూ క్షేత్రస్థాయికి వెళ్లి సభ్యత్వ నమోదుపై పనిచేయాలి.. పార్టీ కోసం అందరూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై కోఅర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.. మన టీడీపీ యాప్‌లో నాయకులందరూ…