తగ్గినట్టే తగ్గిన కోవిడ్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి.. దేశవ్యాప్తంగానే కాదు.. తెలంగాణలోనూ కోవిడ్ రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ పైకి కదులుతోంది. అయితే, కేసుల సంఖ్య పెరిగినా ఆందోళన అవసరం లేదు.. అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో రెగ్యులర్ ఫ్లూస్తో లక్షణాలతో పాటు జ్వరం, తలనొప్పి, స్మెల్ లేకపోవడం ఉంటే ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేసింది.. దేశంలో కరోనా కేసుల సంఖ్య 66 శాతం…
రంగారెడ్డి జిల్లాలో చేపలు వృధాగా పారవేయడం కలకలం రేపింది. మార్గశిర మాసం మొదలవడంతో.. చేపల కోసం మార్కెట్లకు ప్రజలు క్యూకట్టారు. దీంతో చేపలకు విపరీతంగా గిరాకీ పెరిగింది. ఎక్కువ రేటు వున్నాకూడా వినియోగదారుడు చేపలు కొనడానికి వెనుకంజ వేయలేదు. అయితే అది నిన్నటి మాట. రంగారెడ్డిజిల్లా జలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పరిసర ప్రాంతంలో నిర్వాహకులు చేపలను వృధాగా పడేయడం కలకలం రేపుతోంది. గంగపుత్ర సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏడాది నిర్వహించే చేప…
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ప్రధాని విఫలమయ్యారని టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. ‘ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ 2014 ఎన్నికలకు ముందు ఎంతో గంభీరంగా మీరు మాట్లాడినదంతా ఢాంభికమే అనేందుకు ఎనిమిదేళ్ల మీ పాలనే నిదర్శనంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ అసమర్థ నిర్ణయాలు, అర్థిక విధానాలతో కొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా.. ఉన్న ఉపాధి అవకాశాలకు గండి కొట్టారని మండిపడ్డారు. మీరు తీసుకున్న నోట్ల…
బీజేపీలో రాష్ట్ర కమిటీ కంటే పవర్ ఫుల్ కోర్ కమిటీ. ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రధాన నాయకులతో ఆ కమిటీని ఏర్పాటు చేస్తుంది జాతీయ నాయకత్వం. ఇందులో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కూడా ఉంటారు. అయితే తెలంగాణలో విస్తరించాలని.. అధికారంలోకి రావాలని చూస్తోన్న కమలనాథులు.. కోర్ కమిటీ ఏర్పాటు ఊసే ఎత్తడం లేదు. దీనిపై మాట్లాడేవారు .. ప్రశ్నించేవారూ కూడా కరువయ్యారు. ప్రధాని మోడీ.. అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణకు వచ్చి…
తెలంగాణలో కామ్రేడ్లు సైలెంట్ అయ్యారు. సమస్యలున్నా కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యుత్ పోరాటంలో కాల్పుల వరకు లెఫ్ట్ పార్టీల ఉద్యమం ఎగిసిపడింది. అలాంటి వామపక్ష నేతలకు ఏమైంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. నిత్యావసరాల ధరాలు భారీగా పెరిగాయి. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీలో ఛార్జీల మోత మోగుతోంది. విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర జెండాలతో రోడ్డెక్కి ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రభుత్వ ఆఫీసుల ముట్టడితో హోరెత్తించేవి.. CPI, CPM ఇతర వామపక్ష పార్టీలు.…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యా సంవత్సరం మొదలు అవుతున్న నేపథ్యంలో కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోడిపికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎల్ కేజీ నుండే లక్షల్లో ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీగా వసూలు చేస్తూ అకాడమిక్ సంవత్సరంకు అడ్మిషన్లు పూర్తి చేసే పనిలో కార్పొరేట్ యాజమాన్యాలు పడ్డాయి. ఇక కరీంనగర్ లోని ఓ కార్పొరేట్ స్కూల్ లో జరుగుతున్న అధిక వసూల్లపై ఆరా తీసేందుకు కొందరు తల్లిదండ్రుల రూపంలో ఓ కార్పొరేట్ స్కూల్…