Karimnagar: చదువు “కొనలేక” పేరెంట్స్ పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యా సంవత్సరం మొదలు అవుతున్న నేపథ్యంలో కార్పొరేట్ స్కూల్స్ ఫీజుల దోడిపికి అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎల్ కేజీ నుండే లక్షల్లో ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారీగా వసూలు చేస్తూ అకాడమిక్ సంవత్సరంకు అడ్మిషన్లు పూర్తి చేసే పనిలో కార్పొరేట్ యాజమాన్యాలు పడ్డాయి.
ఇక కరీంనగర్ లోని ఓ కార్పొరేట్ స్కూల్ లో జరుగుతున్న అధిక వసూల్లపై ఆరా తీసేందుకు కొందరు తల్లిదండ్రుల రూపంలో ఓ కార్పొరేట్ స్కూల్ వెళ్ళారు. 1 వతరగతి విద్యార్థికి సంవత్సరానికి 80 వేలు, 6 వ తరగతి విద్యార్థికి సంవత్సరానికి లక్ష రూపాయలు చెప్పారు. దీనితో పాటు స్పోర్ట్స్, డ్యాన్స్, ఇతర ఫీజులు మరో 10 వేలు అదనంగా ఉంటాయని చెప్పారు. ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫీజులు ఉన్నాయి ఆఫర్ అవ్వగానే అడ్మిషన్లు కూడా దొరకవని చెప్పడంతో ఖంగుతిన్నాడు.
Also Read
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్ల ద్వారానే..
- Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. అదనంగా మరో రూ.72 వేలు అకౌంట్లోకి..
- VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు తల్లిదండ్రులు జేబులకు చిల్లులు పెడుతున్నాయి. 1 వ తరగతి నుండే లక్షల్లో ఫీజులు ఉండటంతో మధ్యతరగతి ప్రజలు పిల్లలకు ఫీజుల భూతం పట్టుకుంటుంది. కార్పొరేట్ తరహాలో విద్య అందిస్తామని కోర్సుల పేరుతో నయా దందా మొదలు పెట్టాయి కొన్నీ కార్పొరేట్ స్కూల్స్. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్టించుకోవాల్సిన శాఖ అధికారులు చోద్యం చూస్తుండటంతో కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి ప్రవేటు స్కూల్స్ యాజమాన్యాలు. జిల్లాలో 20 కి పైగా కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న జిల్లా యంత్రాంగం పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి వారిపై దృష్టి సారించి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వీరికి ఇంత మొత్తంలో ఫీజులు చెల్లించలేక ఎంతో మంది తల్లితండ్రలు ఇబ్బందులు గురవుతున్నారు. పిల్లభవిష్యత్తు గురించి ఆలోచించాలా.. చాలీ చలని జీతంలో ఎలా ఫీజులు కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు స్కూల్ లకు వెళ్లాలంటే చదువు కొనే పరిస్థితులు ఏర్పాడ్డాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. మరి ఇలాంటి కార్పొరేటర్ స్కూల్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?
తాజావార్తలు
-
India Inflation Shock: ఆహారం నుంచి ఇంధనం వరకు ధరల మంటలు.. 11.39 శాతానికి చేరిన టోకు ద్రవ్యోల్బణం!
-
Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
-
Ambati Rambabu: వైసీపీ కేడర్ను భయపెడుతున్నారు.. రౌడీషీట్లపై అంబటి ఆగ్రహం
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..