హైదరాబాద్‌లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి.. అది కూడా మైనర్ బాలికలే టార్గెట్‌గా కామాంధులు రెచ్చిపోతున్నారు.. మాయమాటలు చెప్పి కొందరు.. వేధింపులకు గురిచేసి ఇంకొందరు.. కిడ్నాప్ చేసి కూడా బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారుతున్నాయి.. జూబ్లీహిల్స్, చాంద్రాయణగుట్ట, మాదాపూర్ ఇష్యూ ఇలాంటి ఘటనలు మరవక ముందే రోజుకో దారుణం వెలుగు చూస్తోంది. తాజాగా, ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు వయస్సు 17 ఏళ్లు కాగా.. ఇద్దరు యువకులు ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు..
Read Also: Loan Apps: లోన్ యాప్స్‌లో కొత్త కోణం.. అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు..!
ఛత్రినాక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉప్పుగూడా ప్రాంతానికి చెందిన బాధితురాలైన బాలికకు గతంలో అలీ అనే యువకుడితో పరిచయం ఉంది.. అయితే, బాలికను తన ఇంటికి పిలిచిన అలీ.. తన స్నేహితుడు అర్బాస్‌ను కూడా రప్పించాడు.. ఆ తర్వాత ఇద్దరు కలిసి బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.. ఇంటికి చేరుకున్న బాలిక తనపై జరిగిన అత్యాచార విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది.. ఇక, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలిని భరోసా సెంటర్‌కు పంపించి దర్యాప్తు చేపట్టారు.. నిందితులుగా ఉన్న అలీ, అర్బాస్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..