వేసవి తాపంతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు వర్షం చల్లబరిచింది. అయితే సోమవారం రాత్రి నుంచి వర్షం దంచికొట్టడంతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం నీటితో నాళాలన్నీ పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు తెలంగాణ మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, నైరుతి రుతుపవనాలు కూడా చురుకుగా ఉండడంతో ఈ…
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెరపడింది. సోమవారం అర్ధరాత్రి విద్యాశాఖ ఉన్నతాధికారులతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా వచ్చి చర్చించడం, నెలరోజుల్లో డిమాండ్లన్నీ నెరవేరుస్తమని హామీ ఇవ్వడంతో.. అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరువుతామని ప్రకటించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువీడకుండా ఆందోళన చేస్తుండటంతో స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం రాత్రి…
* ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. *అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ * విజయవాడలో ఆయుష్ విభాగము ఆధ్వర్యంలో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొననున్న ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ. *అంతర్జాతీయ యోగాదినోత్సవ సందర్బంగా తిరుపతి ప్రకాశం పార్కులో స్దానికులతో కలిసి యోగా చేయనున్న జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి *నేటి నుంచి తిరుపతిలో మూడు…
ప్రస్తుతం వరి కొనుగోలుకి ఇబ్బందులు పడుతున్న వేళ రైతులు వరి పంటకు బదులు ఆయిల్ పాం పంట సాగు వైపు దృష్టి సారిస్తే అధిక లాభాలు ఆర్జించవచ్చు. నిత్యం సాగునీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనే ఆయిల్ పాం సాగు చేయడం సాధ్యమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన సాగునీటి వసతి, నిరం తర విద్యుత్ సరఫరా వల్ల ఈ సదుపాయాన్ని రైతాంగం వినియోగించుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఆయిల్ పాం పంట సాగు చేసే రైతుల కోసం ఫ్యాక్టరీ నిర్వాహకుల…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు రోజులుగా బంకుల్లో డీజిల్ లేకపోవడంతో వాహనదారులు ఉదయం నుండి సాయంత్రం దాకా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ సీజన్ మొదలైన నందున రైతులు తమ టాక్టర్ లకు డీజిల్ కోసం పెద్ద పెద్ద క్యాన్లతో పెట్రోల్ బంకుల ముందు బారులు తీరి ఉన్నారు. అయితే పెట్రోల్ బంకు ఈ సాయంత్రం ట్యాంకరు రావడంతో డీజిల్ కోసం రైతులు ఇతర…
స్థలం ఖాళీ వుంటే చాలు అది మనదే.. ఇలా బడాబాబుల వ్యవహారం నడుస్తోంది. ఆస్థలం కోసం రౌడీలను సైతం రంగంలోకి దింపేందుకు వెనుకాడటం లేదు. ఆస్థలం మీద యజమాని పట్టాలు చూపించిన.. స్థలం కబ్జాచేసేందుకు వెనక్కి తగ్గడం లేదు. అయితే ఇలాంటి ఘటనూ కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులో జరిగింది. కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ హల్ చల్ చేసింది. కష్టపడి ఇళ్ళు నిర్మించుకున్నామని ప్రాధేయపడిన వారిపై కబ్జా గ్యాంగ్ కనికరించడం లేదు. రేకుర్తి…
వచ్చే నెల 2,3 తేదీల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదారాబాద్లో జరగబోతున్నాయి. ఈ సమావేశాల ద్వారా తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం తీసుకురావాలని పార్టీ పెద్దలు లెక్కలేస్తున్నారు. ఇందుకోసం వివిధ కార్యక్రమాల రూపకల్పన చేశారు కమలనాథులు. 3న ప్రధాని మోడీతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ప్రధానితోపాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతారు కూడా. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో సభను సక్సెస్ చేయాలన్నది బీజేపీ ఆలోచన. ఇటీవల జరిగిన బీజేపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షులు,…
రాయలసీమ నుంచి వికారాబాద్ కు పేలుడు పదార్థాలు తరలిస్తున్న పలువురిని దోమ పోలీసులు అదుపులో తీసుకున్నారు. జడ్చర్లలో పేలుడు పదార్థాలు అమ్మిన ఒకరిని అదుపులో తీసుకుని విచారించగా ఈఘటన వెలుగు చూసింది. కానీ వివరాలను పోలీసులు గోప్యంగా వుంచడంతో పలు అనుమానాలకు దారితీస్తోంది. అయితే వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామ శివారులో వెలుతున్న జిలెటిన్స్ స్టిక్స్ వాహనాన్ని పోలీసులు ఆపారు. అందులో .. పేలుడు పదార్థాలు వున్నట్లు గమనించిన పోలీసులు ట్రాక్టర్…
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపును పురస్కరించుకుని జులై 3న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కమలనాథులు కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది. ఈ సభకు ప్రధానమంత్రి మోదీతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర ముఖ్యనేతలు పాల్గొంటారు. చరిత్రలో ఈ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. సభకు 10 లక్షల మందికిపైగా…