ఎవరైనా అడిగితేనే లోన్ ఇస్తారు.. అప్పటికీ రకరకాల కండీషన్స్ ఉంటాయి.. ఎన్నో డాక్యుమెంట్లు, ఫొటోలు, వివరాలు ఇలా చాలా జతపర్చాల్సి ఉంటుంది.. కానీ, హైదరాబాద్ లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూడడం కలకలం రేపుతోంది.. లోన్ కోసం రిక్వెస్ట్ పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నారు నిర్వాహకులు.. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు.. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించకుంటే ఫొటో మార్ఫింగ్‌లు చేస్తున్నారు.. ఇష్టం వచ్చినట్టు తిట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. జంటనగరాల్లో వందల లోన్ యాప్‌లపై కేసులు నమోదు చేశారు పోలీసులు.. అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారంటున్న బాధితులు వాపోతున్నారు..
Read Also: Secunderabad Riots Case: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామాలు..
నేరుగా యాప్ డౌన్‌లోడ్ లింక్స్ పంపుతున్న ముఠా.. ఆ తర్వాత వారి వివరాలను రాబట్టి డబ్బులు జమ చేస్తోంది.. ఆ తర్వాత విశ్వరూపం చూపిస్తోంది. ఈ యాప్స్‌ను చైనా నుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.. కాల్ సెంటర్లు లేకుండా వర్క్ ఫ్రమ్‌హోం ద్వారా ఈ ముఠాను నిర్వహిస్తున్నారు.. గూగుల్ ట్రాన్స్‌లేషన్ ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. కాగా, లోన్ యాప్స్ వేధింపుల కారణంగా మానసిక క్షోభకు గురైనవారు పరువు పోయిందని ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. వాటి కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. కొంత కాలం సైలెంట్‌గా ఉండి.. మరో కొత్త తరహాలో లోన్ ఇవ్వడం, వేధింపులకు గురిచేయడం చేస్తూనే ఉన్నారు కేటుగాళ్లు.