దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ నడుస్తోంది. అన్ని పార్టీలు హేమాహేమీలైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. అయితే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో శ్రీకళారెడ్డి అనే మహిళ పోటీ చేస్తోంది. అయితే ఇప్పుడు ఆమె వార్తల్లో నిలిచారు. కారణం ఏంటంటే.. ఆమె తెలంగాణ ఆడబిడ్డ కావడం విశేషం. తెలంగాణ మహిళ యూపీలో పోటీ చేయడమేంటి? ఎందుకు అక్కడ పోటీ చేస్తున్నారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: KCR Hot Comments: 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ను బీజేపీ వాళ్లు బతకనిస్తారా..
తెలంగాణ రాష్ట్రానికి చెందిన శ్రీకళారెడ్డి అనే మహిళ ఉత్తర్‌ప్రదేశ్‌లోని జౌన్‌పుర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక నాయకుడు, మాజీ ఎంపీ ధనుంజయ్ సింగ్ భార్య అయిన శ్రీకళారెడ్డి.. ఆయనకు బదులుగా ఆమె ఎంపీగా పోటీ చేస్తున్నారు. ధనుంజయ్ సింగ్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. దీంతో ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు. దీంతో ఆయన.. తనకు బదులుగా తన భార్య శ్రీకళారెడ్డిని పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దింపారు. బీఎస్పీ తరఫున జౌన్‌పుర్ ఎంపీగా శ్రీకళారెడ్డి పోటీలో నిలిచారు. ఇదే స్థానంలో బీజేపీ నుంచి కృపాశంకర్ సింగ్, ఎస్పీ నుంచి బాబూసింగ్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Singapore: ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో పురుగుల మందు అవశేషాలు.. సింగపూర్ సర్కార్ కీలక ఆదేశాలు
కె. జితేందర్ రెడ్డి-లలితా రెడ్డి దంపతుల కుమార్తె శ్రీకళారెడ్డి. జితేందర్ రెడ్డి నల్గొండ జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా.. హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా కూడా పని చేశారు. జితేందర్ రెడ్డి నిప్పో బ్యాటరీ గ్రూప్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇది చెన్నై కేంద్రంగా పని చేయగా.. శ్రీకళారెడ్డి బాల్యం అంతా అక్కడే గడిచిపోయింది. ఇంటర్మీడియట్ వరకు చెన్నైలో చదివిన శ్రీకళారెడ్డి.. బీకామ్ మాత్రం హైదరాబాద్‌లో చదివింది. ఆ తర్వాత చదువు నిమిత్తం అమెరికాకు వెళ్లి ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేశారు. అక్కడ స్టడీ కంప్లీట్ అయ్యాక ఇండియాకు వచ్చిన ఆమె.. కుటుంబ వ్యాపారాలు చూసుకుంది. అనంతరం ఆమె యూపీకి చెందిన చెందిన ధనుంజయ్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీజేపీలో కూడా చేరారు. ఆ తర్వాత 2021లో యూపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన శ్రీకళారెడ్డి.. జెడ్పీ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు బీఎస్పీ ఆమెకు ఎంపీ టికెట్ కేటాయించడంతో.. ఎన్నికల బరిలో నిలిచారు. వాస్తవానికి జౌన్‌పుర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ రెండుసార్లు గెలిచింది. ఒకసారి ధనుంజయ్ సింగ్, మరోసారి శ్యామ్ సింగ్ యాదవ్ గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే.. బీఎస్పీ అధినేత్రి ధనుంజయ్ సింగ్ భార్య అయిన శ్రీకళారెడ్డికి ఎంపీ టికెట్ కేటాయించారు. శ్రీకళారెడ్డి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగడంతో ఆమె రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇది కూడా చదవండి: Yuvan Shankar Raja: అంతా తూచ్ అంటూ స్వీట్ షాకిచ్చిన యువన్ శంకర్ రాజా
రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీకళారెడ్డి 2004లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ నుంచే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టీడీపీ టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ టీడీపీలో టిక్కెట్ రాకపోవడంతో ఆ తర్వాత వైసీపీలో చేరారు. తర్వాత రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరారు. 2019లో హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. అయితే టికెట్ దక్కలేదు. ఆ తర్వాత 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయతీ ఎన్నికల్లో గెలిచి జడ్పీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
శ్రీకళారెడ్డి సంపన్నురాలు. ఆమె పేరిట రూ.780 కోట్ల స్థిరాస్తులు, రూ.6.71 కోట్ల చరాస్తులు ఉన్నాయి. రూ.1.74 కోట్లు విలువైన ఆభరణాలున్నాయి. ఈ మేరకు ఎన్నికల అఫిడవిట్‌లో వివరాలు వెల్లడించారు. ధనుంజయ్ సింగ్ వద్ద రూ.3.56 కోట్ల చరాస్తులు, రూ.5.31 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె పేర్కొన్నారు.