Prajapalana Celebrations : ఆరు నూరైంది.. మార్పు మొదలైంది. ప్రజలకు ఇచ్చిన మాటను ప్రజా ప్రభుత్వం నూటికి నూరు పాళ్లు నిలబెట్టుకుంది. తొలి ఏడాది లోనే సుస్థిర ప్రజాస్వామిక పాలనతో దేశంలోనే తెలంగాణను ఆదర్శంగా నిలబెట్టింది. అధికారం చేపట్టినప్పటి తొలి రోజు నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో తెలంగాణ సమ్మిళిత అభివృద్ధికి నిరంతరం సమీక్షలు… సమావేశాలు నిర్వహించారు. కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలకే పరిమితం కాకుండా దాదాపు 160 వినూత్న కార్యక్రమాలను…
TPCC Mahesh Goud : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరి ఆనందానికి కారణమవుతోందని పేర్కొన్నారు. “ప్రజలు సంతోషంగా ఉన్నందునే ప్రభుత్వం పండగ నిర్వహిస్తోంది. ఈ ప్రజాపాలన పండగలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము,” అని అన్నారు. మహేష్ గౌడ్ ప్రకటన ప్రకారం, గత పదేళ్లలో బీఆర్ఎస్ కేవలం 50 వేల ఉద్యోగాలను అందించగలిగితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క…
Bhatti Vikramarka : అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా నాలుగు నెలల కోసం వోట్ ఒన్ అకౌంట్ బడ్జెట్ పెట్టామని, 3లక్షల 69 వేల 286 మంది రెగ్యులర్ ఉద్యోగులకు, 2 లక్షల 86 వేల పెన్షనర్లకు నెల మొదటి రోజే జీతాలు చెల్లిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉద్యోగుల ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించి మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు నెలనెలా జీతాలు చెల్లిస్తున్నామని, నాడు బీఆర్ఎస్ ఉద్యోగ…
Praja Palana Celebration : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు తొలి ఏడాది నుంచి ప్రజా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థికంగా క్రమశిక్షణను పాటించింది. 2014 నుంచి 2023 వరకు పదేండ్లలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలన్నీ కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. వాటిని అధిగమించి ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను…
మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు.
CM Revanth Reddy: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. దీనికి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు పెట్టారు.